” రాజాసాబ్ ” టీం సెన్సేషనల్ డెసిషన్.. అక్క‌డ సంక్రాంతి క్లాష్ తప్పినట్టే..!

ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్‌.. త్వ‌ర‌లో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రభాస్ అభిమానులతో పాటు.. సాధార‌ణ‌ ఆడియన్స్ సైతం ఈ సినిమా విషయంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే.. సినిమా ట్రైలర్‌లో ప్రభాస్ యోగి, బుజ్జిగాడు తరహా వింటేజ్‌ లుక్‌లో మెరిశాడు. అంతేకాదు.. హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా ట్రైలర్‌లో చూపించిన అన్ని సన్నివేశాలు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ విషయంలో మాత్రం మ్యూజిక్ మైనస్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

థ‌మన్‌ చాలా డెల్ స్కోర్ ను సినిమాకు ఇచ్చాడని.. ప్రభాస్ రేంజ్ కు తగ్గ బిజిఎం కనిపించలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 9, 2026న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అదే రోజున.. తమిళ్ స్టార్ విజయ్ జననాయగ‌న్‌ కూడా రిలీజ్ అవుతుంది. అయితే.. రెండు సినిమాలు మధ్యన క్లోజ్ కాంపిటీషన్ నెలకొంటుందని.. అలాగే అక్కడ సంక్రాంతికి క్లాష్ ఏర్పడే అవకాశం ఉందని.. నిర్మాతలు స్మార్ట్ డెసిషన్ తీసుకున్నారట.

The Raja Saab: Prabhas' film avoids a direct clash with Jana Nayagan in  Tamil

రాజాసాబ్‌ విషయంలో తమిళ్ డబ్బింగ్ వర్షన్‌ను జనవరి 9న కాకుండా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్గా రూపొందించగా.. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా మెరవనున్నారు. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి ఒక్కసారి సినిమా రిలీజై పాజిటివ్ టాక్ వస్తే చాలు.. బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.