ఆ సినిమా కోసం ఆంధుడిగా పవన్.. నయా ఎక్స్పరిమెంట్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఓజీ సక్సెస్ జోష్‌లో ఉన్నారు. ఇక తన నెక్స్ట్ మూవీ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా పనులు ఇప్ప‌టికే కంప్లీట్ చేసేసుకున్న ప‌వ‌న్‌.. ఈ సినిమా తర్వాత ప‌లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసింది. ఓజీ సీక్వెల్, ఫ్రీక్వెల్‌ లో నటిస్తానని పవన్ అఫీషియల్ గా వెల్లడించాడు. ఈ ప్రాజెక్ట్లే కాకుండా లోకేష్ కనకరాజ్‌తో మరో సినిమా చేస్తున్నట్టు టాక్ వినిపించింది. అంతకంటే ఇంత‌కంటే ముందు మ‌రో తమిళ్ డైరెక్టర్.. హెచ్ వినోద్‌ తోను సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే వినోద్‌ డైరెక్టర్ పవన్‌కు చెప్పిన ఆ కథ.. ఆఖీరానందన్ కి కూడా తెగ నచ్చేసిందట.

అసలు మ్యాటర్ ఏంటంటే.. హాలీవుడ్‌లో డేర్ డెవిల్ అనే వెబ్ సిరీస్ వ‌చ్చి ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో హీరో బ్లైండ్.. కొన్ని కారణాలతో అతను సూపర్ హీరో గా మారాల్సి వస్తుంది. ఆ తర్వాత అతని లైఫ్ లో ఎదురయ్యే ఇన్సిడెంట్స్, సాహ‌సాలు చాలా అద్భుతంగా తెర‌కెక్కించారు. పవన్‌తో ఈ లైన్ మీద భారీ బడ్జెట్ మూవీ చేయడానికి ఆ తమిళ్ డైరెక్టర్ సిద్ధంగా ఉన్నాడట. ఇంతకీ.. ఆ తమిళ్ డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్నకు లోకేష్ కనకరాజ్‌, హెచ్. వినోద్ పేర్లు వినిపిస్తున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఇద్దరిలో ఒకరు ఆ స్టోరీ లైన్ తో సినిమా తీయనున్నారని టాక్‌ నడుస్తుంది.

Pawan Kalyan Loves Lokesh Kanagaraj Style | cinejosh.com

లోకేష్ అయితే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించాలని ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే.. పవన్‌తో సినిమా కంటే ముందు లోకేష్ చేతిలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఖైదీ 2, రోలెక్స్ ఈ రెండు సినిమాలను కంప్లీట్ చేసి తర్వాత పవన్‌తో సినిమా చేయాల్సి ఉంటుంది. ఇక పవన్ సైతం ఇప్పట్లో కెమెరా ముందుకు వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా అంటున్నాడు. 2027లో లోకేష్ ప్రాజెక్ట్ అన్ని పూర్తి అవుతాయి. అప్పటికి పవన్ డేట్స్ అడ్జస్ట్ అయితే సరే సరి.. లేదంటే హెచ్. వినోద్ తోనే సినిమా చేపించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి అంధుడిగా పవన్ నయా ఎక్స్పరిమెంట్ ఏ రేంజ్ లో వర్క్ అవుట్ అవుతుందో..ముందు.. ముందు.. ఏం జరుగుతుందో చూడాలి.