ఈ ఏడది సంక్రాంతి బరిలో అనీల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను అందుకుంది. ఓ సీనియర్ హీరో సినిమాకు ఏకంగా రూ.300 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వస్తాయని ఎవరు ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో అనీల్ సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు.. వెంకటేష్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత.. అనిల్ మెగాస్టార్ తో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా రూపొందిస్తున్నారు. ఇక సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో.. జనవరి 9న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి నేపద్యంలో.. తాజాగా అనిల్, చిరు కాంబో సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ మేటర్ నెటింట వైరల్‌గా మారుతుంది.
అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో చిరంజీవి నటించిన డాడీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఫాదర్ సెంటిమెంట్‌తో తర్కెక్కిన ఈ మూవీ అప్పట్లో ఆడియన్స్ లో మంచి సక్సెస్ అందుకుంది. ఇక టీవీలో అయితే సినిమాకు అంతకుమించిపోయే రెస్పాన్స్ దక్కింది. కాగా.. తర్వాత దాదాపు ఇదే తరహా స్టోరీ తో కాస్త అటు, ఇటుగా మార్చి విక్టరీ వెంకటేష్ తులసి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించారు. ఈ సినిమా సైతం మంచి హిట్‌గా నిలిచింది. అయితే.. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ అజిత్ హీరోగా విశ్వాసం సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను చూసినప్పుడు కూడా డాడీ మూవీ తరహాలోనే ఉందని ఫీల్ కలుగుతుంది. అయితే.. ఇప్పుడు దాదాపు మళ్ళీ ఇదే స్టోరీ తో అనిల్ సినిమాను తీస్తున్నాడట. ఈ సినిమాలో నయనతార, చిరంజీవి భార్య భర్తలు గా నటించారు. అయితే వీళ్ళిద్దరి మధ్యన గొడవలు జరగడంతో.. కూతురిని నయనతార పెంచుతూ ఉంటుంది.

ఎలాగైనా పాపకు దగ్గర కావాలని చిరంజీవి ఆ పాప చదువుతున్న స్కూల్లోనే డ్రిల్ మాస్టర్ గా మారి ఆమెకు దగ్గరవుతారు. ఈ క్రమంలో నయనతారకు ఇంట్లో వాళ్ళు రెండో పెళ్లి చేయాలనుకోవడం.. అది వెంకటేష్ తోనే కావడం అసలు ట్విస్ట్. అయితే.. దీనికంటే ముందే వెంకటేష్, చిరు ఫ్రెండ్స్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే నయనతార.. తన స్నేహితుడి భార్యని తెలుసుకున్న వెంకటేష్ వీళ్ళిద్దరిని కలిపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టి సక్సెస్ అవుతాడు. ఈ క్రమంలో జరిగే కాన్వర్జేషన్, ఫన్నీ సీన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. నిజంగానే కథ ఇదే అయితే.. ఆడియన్స్‌కు కాస్త రొటీన్ ఫీల్ కలిగే అవకాశం ఉంది. కానీ.. అనిల్ కు తన స్క్రీన్ ప్లే తో అద్భుతమైన కామెడీ జోడించి.. ఆడియన్స్ పొట్ట చక్కలయ్యేలా నవ్వించి హిట్ కొట్టడం వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే.. ఈ సినిమాతో మెగాస్టార్‌కు బ్లాక్ బస్టర్ ఇస్తాడంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

