సినీ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ప్రతి ఒక్కరు రాజమౌళి డైరెక్షన్లో నటించాలని ఆరాటపడుతుంటారు. ఆయన సినిమా అంత సులువుగా ఏమైపోదు. కనీసం.. రెండు మూడేళ్లయిన డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయడానికి కూడా స్కోప్ ఉండదు. ఈ క్రమంలోనే.. ఇతర హీరోలు మూడు నాలుగు సినిమాలు చేసేసి భారీ రెమ్యూనరేషన్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. అయినా.. కూడా జక్కన్న తోనే సినిమా చేయాలని హీరోస్ ఎదురుచూస్తూ ఉంటారు. కారణం.. ఆయన సినిమా హిట్ అయితే ఆల్ ఇండియా లెవెల్లో కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. అందులో నటించే హీరోలకు తిరుగులేని ఇమేజ్ దక్కుతుంది. అ..లా ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ లు పాన్ ఇండియాలో ఎలాంటి క్నేజ్తో దూతకుపోతున్నారో తెలిసిందే.

ఇప్పుడు అలాంటి జక్కన్నతో.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. ఆరు నెలల క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు 25% షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో పీక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. అయితే జక్కన్న – మహేష్ కాంబో ఇప్పుడు సెట్ అయినది కాదట దాదాపు 12 ఏళ్ళ క్రితమే వీళ్ళిద్దరి సినిమా రావాల్సింది. కాగా.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్స్ అంత మహేష్ తో సినిమా చేయాలని చూస్తుంటారు. కానీ.. మహేష్ మాత్రం రాజమౌళి సినిమా చేయాలని కోరుకునేవాడట. అలా.. పదేళ్ల క్రితం సెట్ అయిన ఈ కాంబో రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న జక్కన్న.. ఈసారి మహేష్ మూవీ తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు.
అయితే.. గ్లోబల్ రేంజ్ లో సక్సెస్ అందుకున్న తర్వాత మాహేష్ సినిమా.. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కేవలం ఇండియన్ బాక్సాఫీస్ కాదు.. హాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయడం టార్గెట్‌గా రాజమౌళి పనిచేస్తున్నాడు. 120 కి పైగా దేశాల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. రాజమౌళి గతంలో2010 అభిమానికి ఇచ్చిన ఓ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అభిమాని మాట్లాడుతూ.. మీరు మహేష్ తో చేయబోయే సినిమాకు కీరవాణి కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టొచ్చుకదా అనే ప్రశ్నకు రాజమౌళి మాట్లాడుతూ.. అలాంటి పరిస్థితి వస్తే మహేష్ తో సినిమా చేయడం మానేస్తా. అంతేకానీ.. కీరవాణిని మాత్రం వదలను. కీరవాణి లేకుండా సినిమా చేయడం అంటే చేతులు వెనక్కు కట్టేసుకుని యుద్ధానికి వెళ్లడం అంటూ వివరించాడు. ప్రస్తుతం ఈ ట్విట్ పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ హైలెట్ చేస్తూ మహేష్ పై ట్రోల్స్ చేస్తున్నారు.
@manidhar33 I wud forgo de chance of wrkng wid mahesh rather than leaving MMK out. It’s lyk going 2 battle wid my hands tied back
— rajamouli ss (@ssrajamouli) May 18, 2010


