టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్‌లో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ప్రభాస్.. కేవలం సాధారణ ఆడియన్సే కాదు.. సినీ సెలబ్రిటీలను సైతం ఫిదా చేస్తూ ఉంటాడు. వ్యక్తిగతంగాను ఆయనపై ఎంతో మంది ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే.. చాలామంది స్టార్ హీరోయిన్స్ సైతం.. ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఇష్టపడతారు. ఇలాంటి క్రమంలోనే.. ప్రభాస్ పై విపరీతమైన ప్రేమను పెంచుకున్న ఓ స్టార్ హీరోయిన్.. ఏకంగా షూటింగ్ సెట్స్ లోనే అతనిని ప్రేమ పేరుతో తెగ టార్చర్ చేసిందని.. లవ్ లెటర్స్ రాసి ఇబ్బంది పెట్టేసేది అంటూ టాక్ వైరల్‌గా మారుతుంది.

ఇంతకీ.. ఆ హీరోయిన్ ఎవరు.. ఆ సినిమా ఏంటి.. ఒకసారి చూద్దాం. ప్రభాస్ హీరోగా, ప్రభుదేవా డైరెక్షన్‌లో నటించిన పౌర్ణమి సినిమా.. ఏ రెంజ్‌లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిష, చార్మి హీరోయిన్‌లుగా మెరిసారు. అయితే.. ఈ సినిమాలో త్రిష ఫస్ట్ హీరోయిన్. కాగా.. ఛార్మి కంటే ముందు.. సెకండ్ హీరోయిన్ గా మరో ముద్దుగుమ్మను భావించారట. ఇక సినిమా షూట్ ప్రారంభమైన టైంలో.. ఆ హీరోయిన్ ప్రభాస్‌ను ప్రేమిస్తున్నాను అంటూ ఇబ్బంది పెట్టడం.. లవ్ లెటర్స్ రాసి సెట్స్‌లోనే అందరి ముందు ప్రేమిస్తున్నానంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడడంతో.. హీరోయిన్ ప్రవర్తనకు విసిగిపోయిన ప్రభాస్.. వెంటనే ప్రభుదేవా తో చెప్పి ఆమెను సినిమా నుంచి తప్పించాడు.

నాకు హీరోయిన్ తో నటించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే ఆమెను మార్చండని రిక్వెస్ట్ చేశాడట. దీంతో ప్రభుదేవా ఆ హీరోయిన్ చేసే పనులు చూసి.. ఆమెను సినిమా నుంచి తీసేసి వెంటనే తన ప్లేసులో చార్మిని పెట్టుకున్నారు అంటూ ఓ టాక్ వైరల్ గా మారుతుంది. అప్పట్లో ఈ ముద్దుగుమ్మకు ప్రభాస్ అంటే తెగ ఇష్టం ఉండేదట. కానీ ప్రభాస్ మాత్రం ఆమెను చూసి చూడనట్లుగా వదిలేశాడు. ఇక ఆమెకు ఇప్పుడు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు.

