పెద్ది కోసం చరణ్ బిగ్ రిస్క్.. కొండ లోయల్లో చెట్టు కొమ్మపై నుంచొని అలా.. వీడియో వైరల్..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది పై ఆడియన్స్‌లో రోజురోజుకు అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. రంగస్థలం తర్వాత.. చరణ్ నుంచి వస్తున్న కల్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో.. ఈసారి సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో మోత మోగించడం ఖాయమని.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవుతుందంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే.. డైరెక్టర్ బుచ్చిబాబు సన్న‌ సైతం సినిమా చాలా జాగ్రత్తగా చెక్కుతున్నాడట. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన 60% షూటింగ్ కంప్లీట్ అయిందని టాక్. అయితే.. మార్చి 27న చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ మూవీ రిలీజ్ చేస్తామని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

అయితే.. ఈ డేట్ కు సినిమా రావడం కష్టమే అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ నడుస్తుంది. ఇలాంటి క్రమంలో.. సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ షూట్ వీడియో నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ సినిమా కోసం చరణ్ ఎంత కష్టమైనా.. ఎలాంటి రిస్కైనా చేయడానికి సిద్ధమవుతాడు అనడానికి ఈ వీడియోని పర్ఫెక్ట్ ఎగ్జామ్‌పుల్ అంటూ మెగా ఫ్యాన్స్ దానిని తెగ‌ ట్రెండ్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. సినిమాకు సంబంధించిన సాంగ్ షూట్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. రామ్ చరణ్ ఒక కొండలోయ అంచున చెట్టు కొమ్మ మీద నుంచుని డ్యాన్స్ చేయడం ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. మ్యూజిక్ కూడా చాలా వినసొంపుగా అనిపిస్తుంది.

As Ram Charan completes 18 years, 'Peddi' makers unveil new poster of the Global  Star – Firstpost

ఏ ఆర్ రెహమాన్ చాలా కాలం గ్యాప్ తర్వాత ఓ పవర్ఫుల్ ఛార్జ్ బస్టర్ ఆల్బమ్‌ను టాలీవుడ్‌లో అందించనున్నారు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి.. సినిమాపై మెగా ఫ్యాన్స్‌లోనే కాదు.. సాదరణ ఆడియన్స్‌లోను మంచి హైప్‌ మొదలైంది. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ వీడియోతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. అయితే.. చరణ్ అలా కొండ అంచుల్లో.. కొమ్మపై నుంచుని డ్యాన్స్ చేస్తున్న విషయం మాత్రం ఫ్యాన్స్ కు కాస్త టెన్షన్ పెడుతుంది. మరి.. కొండ అంచుల్లో ఇంత రిస్క్ అవసరమా అన్న మీకు అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. సినిమా విషయంలో చరణ్ అన్న డేడికేషన్ ఇలా ఉంటుంది. ఈ వీడియోతో ఆయనకు సినిమాపై ఉన్న గౌరవం మరోసారి రుజువైందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.