మలయాళ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోతుంది. తన అద్భుతమైన నటనతో మళ్ళయాతల, తెలుగు, తమిళ్, హిందీ వర్షన్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దుల్కర్.. నిర్మాతగాను ప్రస్తుతం బిజీబిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలను తెరకెక్కించి సక్సస్‌లు అందుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలో.. తాజాగా దుల్కర్‌కు బిగ్ షాక్ తగిలింది. యార్నాకులం సౌత్ స్టేషన్లో వేఫేరర్ ఫిలిం పేరుతో తాను కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న అంటూ ఓ యువతి షాకింగ్ ఆరోపణలు చేశారు. ఫిర్యాదులో.. అసోసియేటివ్ డైరెక్టర్ దీనిల్ బాబు అనే వ్యక్తి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని తనకు లొంగిపోవాలని వేధించాడంటూ చెప్పుకొచ్చింది.
ఈమె ఆరోపణల ప్రకారం దినిల్ బాబు వేఫేరర్ ఫీలిమ్స్ తరఫున మాట్లాడుతున్నానని అన్నారని.. ఇక రాబోయే సినిమాకు సంబంధించిన ఆడిషన్స్ పేరుతో తనను పినమిల్లి నగర్ దగ్గర్లోని ఓ బిల్డింగ్‌కు పిలిచాడంటూ వివరించింది. అక్కడ తనను గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడని.. కోపరేట్ చేయకపోవడంతో మలయాళ ఇండస్ట్రీలో ఇక నీకు అవకాశాలు రాకపోవచ్చు అంటూ బెదిరించాడని.. ఆమె చెప్పుకొచ్చింది. తన వద్ద ఉన్న వాయిస్ మెసేజ్‌లో చాట్ రికార్డులను కూడా పోలీసులకు సబ్మిట్ చేసింది. ఈ క్రమంలోనే యువతి ఫిర్యాదు మేరకు.. యార్నాకొళం సౌత్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదుచేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ ఘటనపై వేఫేరర్ ఫిలిమ్స్ అఫీషియల్ రియాక్ట్ అయింది.
సంస్థ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్లో దినిల్ బాబుకు.. తమ కంపెనీ తో ఎలాంటి సంబంధమే లేదని.. వీళ్లు నిర్మించిన ఏ సినిమాలోని అతను అసలు భాగం కాలేదంటూ.. క్లారిటీ ఇచ్చింది. అతను సంస్థ పేరును వాడుకోవడం.. తప్పుడు కాస్టింగ్ కాల్స్ నిర్వహించి మా సంస్థకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నమే తప్ప.. మరేది లేదంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. దినిల్ బాబు పై దీవ్ర పోలీస్ స్టేషన్లో తాము కూడా అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు వివరించింది. క్యాస్టింగ్ కాల్ పేరుతో వేఫేరర్ ఫిలిమ్స్ ప్రతిష్ట దెబ్బతినకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఆ నోట్లో పేర్కొన్నారు. తమ కాస్టింగ్ కాల్స్ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ ద్వారానే జరుగుతాయని.. ఇతర వ్యక్తులు లేదా నకిలీ ప్రొఫైల్స్ తో వచ్చే ఆఫర్లను అసలు నమ్మకండంటూ అభిమానులు, కళాకారులకు విజ్ఞప్తి చేశారు. కాగా.. దుల్కర్ సల్మాన్ ఇప్పటివరకు పర్సనల్‌గా దీనిపై రియాక్ట్ కాలేదు. ఈ వివాదం మలయాళ సినీ వర్గాల్లో ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారింది.