టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి 2 తర్వాత పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తాను చేసిన ప్రతి ఒక్క పాన్ ఇండియన్ సినిమాతోనూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మినిమం కలెక్షన్లను కొల్లగొడుతూ రాణిస్తున్నాడు. అంతే కదా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించిన హీరోగాను ప్రభాస్ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు.. ప్రస్తుతం అరడజన్‌కు పైగా సినిమాలతో బిజీ బిజీగా గడునుతున్నాడు.
తను తెరకెక్కించే ప్రతి సినిమా విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అలాంటి ప్రభాస్.. గతంలో చాలా చాలా బాడ్ సిచువేషన్ లను ఫేస్ చేశాడని.. ఎన్నో బాధల్లో అనుభవించడం వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ అత్యంత బ్యాడ్ సిట్యుయేషన్ మరేదో కాదు.. వాళ్ళ నాన్న సత్యనారాయణ రాజు మరణించడం. తను నాన్న మరణం తర్వాత చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాడట.. పెదనాన్న కృష్ణంరాజు ధైర్యం చెప్పిన.. ప్రభాస్‌కు ఏదో కోల్పోయిన బాధ మాత్రం అలాగే ఉండిపోయిందట.
అదే టైంలో అతను చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో.. మానసికంగా ఎంతగానో దెబ్బ తిన్న ప్రభాస్.. ముందు పెళ్లి చేసుకోవాలని అనుకున్న తర్వాత పెళ్లె ఆలోచనను పక్కన పెట్టేశాడట. కెరీర్ పై కాన్సెంట్రేట్ చేసి మంచి పొజిషన్ కి వచ్చిన తర్వాత.. పెళ్లి గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యడట. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే.. కెరీర్ పరంగా స్ట్రాంగ్ పోసిషన్ దక్కించుకున్న ప్రభాస్ ఇప్పటికీ పెళ్లి పై మాత్రం ఆసక్తి చూపట్లేదు. సింగిల్గానే లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఫ్యూచర్లో అయినా ప్రభాస్ ఆలోచనలన్నీ దాటుకుని పెళ్లిపై ఆలోచన చేస్తాడా.. లేదా.. ఓ ఇంటి వాడవుతాడా లేదా అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి.