టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సూపర్ డూపర్ సక్సెస్ లతో మంచి జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌లతో వరుసగా నాలుగు సక్సెస్లను ఖాతాలో వేసుకున్న బాలయ్య.. మరోసారి బాక్సాఫీస్ బ్లాస్ట్‌కు సిద్ధమవుతున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ లాంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అఖండ 2కు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ సినిమా పనులు పూర్తయిన తర్వాత.. బాలయ్య, గోపిచంద్ మల్లినేని డైరెక్షన్‌లో ఎన్బికె 111 సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నడట. ఇప్పటికే.. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయిందని సమాచారం.
ఈ క్రమంలోనే.. సినిమా సెకండ్ హాఫ్ చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతుందని.. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ కూడా సినిమాకు హైలెట్ గా మారుతుందని.. ఇక సినిమా ఫ్లాష్ ప్యాక్ ఎపిసోడ్‌లో బాలయ్య మాఫియా బ్యాక్ డ్రాప్ లో కనిపించనున్నాడని టాక్. గోపీచంద్ మేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ ఎమోషన్స్, యాక్షన్.. అన్నింటిని సమపాళ్లలో పండిస్తూ.. అందరిని ఆకట్టుకునేలా డిజైన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే.. ఎన్బికె 111 స్టోరీ అదే రేంజ్‌లో రూపొందించాడని తెలుస్తుంది.
వృద్ధి సినిమాస్ బ్యానర్ పై.. వెంకట సతీష్ కిల్లారు భారీ బడ్జెట్లో రూపొందిస్తున్న ఈ సినిమాకు.. బాలయ్య రేంజ్‌కు తగ్గ గ్రాండ్ ఎలివేషన్స్.. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, ఆడియన్స్ హార్ట్ టచ్ చేసే ఎమోషన్స్ మిక్స్ చేసి తెరకెక్కించనున్నారు. తాజాగా.. సోషల్ మీడియా వేదికగా.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. గాడ్ ఆఫ్ మాసెస్ ఇజ్ బ్యాక్.. గర్జన మరింత స్ట్రాంగ్‌గా ఉండబోతుందంటూ వివరించాడు. బాలకృష్ణ గారితో మరోసారి పనిచేయడం నాకు గర్వకారణం. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా రూపొందిస్తామంటూ రాసుకొచ్చాడు. ఇక గతంలో వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన వీర సింహారెడ్డి ఏ రేంజ్‌లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే ఆడియన్స్‌లో హై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. ఇక.. గోపీచంద్ ఈసారి బాలయ్యతో ఎలాంటి ఔట్పుట్ ఇస్తాడో.. మళ్ళీ బ్లాక్ బస్టర్ మ్యాజిక్ రిపీట్ అవుతుందో.. లేదో.. చూడాలి.