టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్లతో ఫుల్ జోష్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా ఆయన నటించిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే.. బాలయ్య నుంచి నెక్స్ట్ వస్తున్న అఖండ 2 తాండవం పై కూడా ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగా అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న క్రమంలో.. కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి బాలయ్య బాక్సాఫీస్ బ్లాస్ట్ చేయడం ఖాయమంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు.. దాదాపు రూ.150 కోట్లు నుంచి రూ.200 కోట్ల వరకు బడ్జెట్ అయిందని తెలుస్తుంది.
తెలుగు ఇండస్ట్రీలోని హైయెస్ట్ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా అఖండ 2 నిలవనుంది. అంతేకాదు.. సీనియర్ స్టార్ హీరోల సినిమాలో ఇప్పటివరకు ఈ రేంజ్ బడ్జెట్‌లో మూవీ తెరకెక్కలేదు. ఈ క్రమంలోనే.. అఖండ 2పై ఆడియన్స్‌లో మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే.. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అఖండ పాత్రకు.. సంబంధించి డైరెక్టర్ బోయపాటి శ్రీను బ్లాస్టింగ్ సర్ప్రైజ్ ను ప్లాన్ చేశాడట. సినిమా క్లైమాక్స్ సీన్స్ లో బాలయ్య చేసే పరమశివుని తాండవం.. ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తుందని.. ఒక రకమైన ట్రాన్స్‌లోకి తీసుకు వెళుతుందని.. సినిమా చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ ఓ రకమైన ఎమోషన్స్లో ఫీలవుతారు అంటూ సినీ వర్గలలో టాక్ వైరల్ గా మారుతుంది. ఫస్ట్ పార్ట్ ను మించి పోయే రేంజ్‌లో మరోసారి బోయపాటి మాస్ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయట.
14 నీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచ్చంట, గోపి ఆచ్చంట సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాల్లో.. బాలకృష్ణ సరసన యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా మెరవనుంది. మరో క్రేజీ హీరో ఆది పిన్నిశెట్టి, బాలీవుడ్ యాక్టర్ హర్షాలి మల్హోత్రా సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక.. సినిమాకు అతిపెద్ద హైలెట్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించడం. అఖండ సినిమాలో మ్యూజిక్ కు థియేటర్లలో బాక్సులు బద్దలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకుమించి పోయే రేంజ్ లో అఖండ 2 తాండవం ఉంటుందని.. థియేటర్లు తగలబడిపోయే రేంజ్ లో బిజిఎం ఇస్తున్నాడు అంటూ తెలుస్తుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ కాంబో ఏ రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.