టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఆయన లా స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సీన్స్, బోల్డ్ కంటెంట్ మునుపెన్నడు మరేస్టార్ డైరెక్టర్ చూపించలేకపోయాడు. అంతేకాదు మూడు గంటల రన్ టైంతో ఫుల్ ఎంగేజింగ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ కూడా సందీప్ రెడ్డినే. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శక దిగజాలైన రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ సైతం సందీప్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఆయన మాట తీరు.. ఎదుటి వాళ్లకు వేసే కౌంటర్లకు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం ఆయనలా స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తూ మాట్లాడాలని ఉందని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అలాంటి సందీప్ రెడ్డివంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాల్లో విలన్ అంటే ఏ రేంజ్ లో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారా తెలిసిందే. దానికి తగ్గట్టుగానే సందీప్ రెడ్డివంగా సౌత్ కొరియన్ యాక్టర్ అయినా డాన్‌లీ ని ఈ సినిమాకు విలన్‌గా ఫిక్స్ చేశాడట. ఇప్పటికే కొరియన్ యాక్షన్ హీరోగా డాన్‌లి వరల్డ్ వైడ్ పాపులారిటీని దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే స్పిరిట్‌లో ప్రభాస్‌కు విలన్‌గా డాన్‌లీ పర్ఫెక్ట్ అని భావించాడట సందీప్. ఇక తాజాగా.. సందీప్ రెడ్డివంగా ఓ ఈవెంట్ల సందడి చేశాడు. ఇక ఈవెంట్ల సందీప్ రెడ్డివంగా ఫ్యాన్స్.. ఓ ఫ్లకార్డ్ ద్వారా ఆయనకు ఒక ప్రశ్న సంధించారు.
అదే.. ” స్పిరిట్లో విలన్ గా డాన్‌లీ ఎందుకన్నా.. నువ్వే చేయొచ్చుగా.. మా అభిమానుల కోసం డాన్‌లీ ” .. అని దీనిపై సందీప్ రెడ్డి రియాక్షన్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. సందీప్ రెడ్డివంగా ఈ రిక్వెస్ట్ పై రియాక్ట్ అవుతూ.. అయితది.. అయితది.. అన్ని అయితయ్.. థాంక్యూ.. థాంక్యూ.. అంటూ వివరించాడు. ఇక సందీప్ రెడ్డి రియాక్షన్ తో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈలలు, కేకలు వేస్తూ ఈవెంట్లో తెగ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారుతుంది. ఇదిలా ఉంటే యానిమల్ సినిమాల్లో బాబి డియోల్, రణబీర్ కపూర్, క్లోన్ అజీస్ పాత్రలకు సందీప్ రెడ్డివంగానే డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. సినిమాలో డబ్బింగ్ డైలాగ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే.. ఇక ఆయనే రంగంలోకి దిగి విలన్ గా నటిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఆసక్తి ఆడియన్స్‌లో మరింతగా పెరిగింది.