టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మీరాయ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. రితికా నాయక హీరోయిన్‌గా.. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో.. శ్రియ శరణ్, జగపతిబాబు కీలకపాత్రలో మెరిశారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే.. ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పింది. సినిమా ట్రైలర్, సాంగ్స్ ప్రతి ఒకటి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. విజువల్స్ పరంగా సినిమా పై హైప్ పెరిగింది. ఈ క్రమంలోనే.. పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ అయిన సినిమా.. ప్రస్తుతం మిక్స్డ్ టాక్‌తో కొనసాగుతుంది.
ఇక సినిమా విజువల్స్ ఆకట్టుకున్నాయని.. మంచు మనోజ్, తేజ సజ్జ నటన ప్రేక్షకులను మెప్పిస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ సినిమా కోసం కార్తీక్ ఘట్టమనేని కథను రాసుకొని దాదాపు మూడు సంవత్సరాలు అయిందట. అయితే.. కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా కొనసాగుతున్న క్రమంలో డైరెక్టర్గా సినిమా తీస్తానంటే ఎవరు ఆయనతో సినిమా చేసే సాహసం చేయలేదు.
ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోలు వెనకడుగు వేసినా.. కార్తీక్ మాత్రం విసిగిపోకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇక నాచురల్ స్టార్ నాని ఈ కథ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. కానీ.. నిర్మాతకు నాని మధ్యన ఒక రౌండ్ ఫిగర్ కుదరకపోవడంతో.. సినిమా నుంచి నాని తప్పుకున్నారు. ఇక అప్పటికే హనుమాన్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న తేజా సజ్జకు కథ చెప్తే బాగుంటుందనే ఆలోచన కార్తిక్‌కు రావడం వెంటనే కార్తీక్.. తేజను కలిసి స్టోరీ చెప్పడం.. తేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ టాక్‌ని దక్కించుకుంది. ఇక ముందు ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.. కలెక్షన్లు ఏ రేంజ్ లో కొల్లగొడుతుంది చూడాలి.