పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన 51 వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్, రాజకీయ ప్రముఖుల నుంచి అలాగే.. పవన్ అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. తమ సినీ కెరీర్‌లో చాలా సందర్భాల్లో తమ వద్దకు వచ్చిన కథలను వదులుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే వాళ్లు రిజెక్ట్ చేసిన కథలో బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సందర్భాలు ఉంటాయి. అలా.. పవన్ సినీ కెరీర్‌లోను తాను రిజెక్ట్ చేసిన సినిమాలలో చాలా వరకు బ్లాక్ బస్టర్‌లు ఉన్నాయంటూ ఓ టాక్ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ పవన్ తన సినీ కెరీర్‌లో వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలేంటో ఒకసారి చూద్దాం.
పవన్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలో మొదటిది అతడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మహేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కథను మొదట పవన్‌కు వినిపించాడట. కానీ ఏవో కారణాలతో ఈ సినిమాను పవన్ రిజెక్ట్ చేశాడు. దీంతో మహేష్ చేతికి ప్రాజెక్ట్ వెళ్లింది. అప్పట్లో ఇది ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది క్లాసికల్ హిట్. ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నువ్వే కావాలి సినిమాకు సైతం మొదటి పవన్ కళ్యాణ్ ని హీరోగా భావించారు. సినిమా ఫిక్స్ అయి సెట్స్పైకి కూడా వచ్చి.. కొన్ని కారణాలతో మధ్యలో ఆగిపోయింది.
అదే కథతో తరుణ్‌ను హీరోగా పెట్టి నువ్వే కావాలి సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇది అప్పట్లో ట్రెండ్ సెట్టర్ మూవీ. అంతేకాదు.. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటైన విక్రమార్కుడు కోసం కూడా మొదట పవన్‌ను హీరోగా భావించారట. కానీ.. అప్పట్లో పవన్ సినిమాలతో బిజీగా ఉండడం, కాల్‌షీట్లు కేటాయించలేక సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో రవితేజ ఈ ప్రాజెక్టులో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక రవితేజ నటించిన మరో బ్లాక్ బస్టర్ మూవీ ఇడియట్. ఈ సినిమా అవకాశం కూడా మొదట పవన్‌కు వెళ్ళింది. పూరి జగన్నాథ్.. పవన్‌కు కథ వినిపించగా.. కొన్ని కారణాలతో పవన్ సినిమాను వదులుకున్నాడు.
ఈ కథను రవితేజ కి చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్న పూరి.. ఇడియట్ తో బిగ్గెస్ట్ హిట్ రవితేజకు అందించాడు. ఈ సినిమా రవితేజ కెరీర్ కు టర్నింగ్ పాయింట్. అంతేకాదు పూరి జగన డైరెక్షన్లో.. రవితేజ హీరోగా తెరకెక్కిన మరో బ్లాక్ బస్టర్ మూవీ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి.. సినిమా మొదట పవన్ చేతికే వెళ్లిందట. కొన్ని వ్యక్తిగత కారణాలతో పవన్ సినిమాను రిజెక్ట్ చేశాడు. సినిమాలో రవితేజ నటించిన బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక మహేష్ బాబు ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి. సినిమాను పూరి జగన్నాథ్ మొదటి పవన్ కళ్యాణ్ కి వినిపించాడట. కానీ.. ఆయన కథకు నో చెప్పేసాడు. దీంతో.. అవకాశం మహేష్ కు వచ్చింది. ఇది మహేష్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. యూత్లో మహేష్ క్రేజ్ ను డబల్ చేసింది.