పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు చెప్తే చాలు ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలాంటి పవన్ నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఆడియన్స్‌లో ఏ రేంజ్ లో హైప్ మొదలవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా.. పవన్ ప్రస్తుతం ఓజి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈనెల 25న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌తోను అంతకంతకు అంచనాలను పెంచుకుంటూ పోతుంది. ఇక నేడు.. పవన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.
ఇక దాదాపు రెండేళ్ల క్రితం సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసాయి. అంతేకాదు.. దీని తర్వాత వచ్చిన లిరికల్ సాంగ్స్ సైతం మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఎక్కడ చూసినా ఓజి వైబ్ మొదలైపోయింది. ఇక మరికొద్ది క్షణాల్లో రిలీజ్ కానున్న ఓజి గ్లింన్స్.. పవన్ కళ్యాణ్ తో పాటు.. విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మీ కూడా మేరవనన్నాడని.. 45 నుంచి 60 సెకండ్ల నడివితో రానున్న ఈ టీజర్ కట్.. హైప్‌ను పదింతలు పెంచేస్తుందంటూ చెబుతున్నారు. ఇక సినిమా క్లైమాక్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రస్తుతం వైరల్ గా మరాయి. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన ప్రతి పాన్ ఇండియన్ సినిమా క్లైమాక్స్ పార్ట్ 2కి సంబంధించిన క్లిప్ హ్యాంగర్ గా మాత్రమే పెడుతున్నారు.
కానీ.. ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ గా ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుందని.. థియేటర్లో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు కన్నీరు పెట్టుకునే రేంజ్ లో ఎమోషనల్ సీన్స్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ ఎమోషనల్ సీన్స్ ఏంటో.. గ్యాంగ్స్టర్ సినిమాలో క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఎలా డిజైన్ చేస్తారు.. డైరెక్టర్ అసలు ఏం ప్లాన్ చేశాడని సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఒకవేళ క్లైమాక్స్ లో హీరో క్యారెక్టర్ ను ఎండ్ చేసేలా ఏమైనా ప్లాన్ చేశాడా.. అసలు అలాంటి క్లైమాక్స్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా.. లేదా.. అనే చర్చలు సైతం మొదలయ్యాయి. ఇక మరికొద్ది క్షణాల్లో రిలీజ్ కానున్న గ్లింన్స్ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.