రూ.60 కోట్ల మీరాయ్.. 10 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

టాలీవుడ్ యంగ్‌ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ.. పాన్ ఇండియన్ మూవీ మీరాయ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాకు సాలిడ్ సక్సెస్ లభించింది. ఇక సినిమా రిలీజై నిన్నటితో పది రోజులను కంప్లీట్ చేసుకుని ఇప్పటికి సక్సెస్ఫుల్గా థియేటర్లలో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే.. మీరాయి 10 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వైరల్ గా మారుతున్నాయి. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఇప్పటికే రూ.134.40 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం విశేషం.

Teja Sajja's Mirai Collects Over 134 Crores in 10 Days, A Stellar Box  Office Performance

ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. కాగా.. ఓ సినిమా టికెట్లపై ఎలాంటి హైక్‌ లేకుండా.. ప్రీమియర్ షోస్ లేకుండా.. పది రోజుల్లో ఈ రేంజ్‌ కలెక్షన్లు కల్లగొట్టడం అంటే అది సాధారణ విషయం కాదు, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని స్క్రీన్ ప్లే బాధ్యతలు కూడా నిర్వహించిన ఈ సినిమాకు.. శ్రీ నాగేంద్ర తంగళ‌ కళ దర్శకుడుగా వ్యవహరించారు. మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ గా ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు.

Mirai box office collection Day 5: Teja Sajja's film is rock steady, nears  the Rs 100 crore mark

ఆయన పర్ఫామెన్స్‌ సినిమాకు మరింత ప్లస్ అయింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌గా రితికా నాయ‌క్‌ నటించిన ఈ సినిమాలో శ్రియ శరణ్‌, జగపతిబాబు, గెట‌ప్ శీను, వెంకటేష్ తదితరులు కీలకపాత్రలో మెరిసారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. గౌరీహరి మ్యూజిక్, ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు ఓజీ వ‌చ్చేవ‌ర‌కు క‌లెక్ష‌న్ల‌కు ఎలాంటి డోకా ఉండ‌ద‌న‌డంలో సందేహం లేదు. ఈ మూవీ ఫుల్ ర‌న్‌లో ఏ రేంజ్ క‌లెక్ష‌న్‌లు కొల్ల‌గొడుతుందో చూడాలి.