సింగిల్ కామెంట్ తో మనోజ్ లైఫ్ చేంజె చేసిన పవన్.. మిరాయ్ సక్సెస్ కు అదే కారణమా..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ మిరాయ్‌ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్ కరువైన నేపథ్యంలో మీరాయ్‌ సక్సెస్ టాలీవుడ్‌కు మంచి బూస్టప్‌గా నిలిచింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్ సినిమా.. ఐదు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు.. సినిమా ఇప్పటికీ అదే ఫామ్ లో వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. రితిక నాయక్ హీరోయిన్ గా, కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో శ్రియ, జగపతిబాబు కీలక పాత్రలో మెరువగా.. మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు.

Mirai Cast Fees Details: Manchu Manoj reportedly gets Rs 3 crore, more than Teja  Sajja? Find out | PINKVILLA

ఈ సినిమాలో మనోజ్ పర్ఫామెన్స్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా హిట్ కావడానికి ఓ రకంగా మనోజ్‌ విలన్ రోల్ కూడా కారణమని చెప్పొచ్చు. హీరోకు పర్ఫెక్ట్ విలన్ గా.. గట్టి పోటీ ఇచ్చే నెగెటివ్ షేడ్స్‌లో మనోజ్ తన నటనతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే మనోజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందడి చేసిన మంచు మనోజ్.. అసలు సినిమాలో విలన్ పాత్రను ఒప్పుకోవడానికి గల కారణమేంటో వివరించాడు.

Pic Talk: Manchu Hero Meets Pawan Kalyan

నేను పవన్ కళ్యాణ్ గారిని చాలాసార్లు కలిశానని.. నేను ఆయన కలిసినప్పుడు.. నువ్వు నెగటివ్ రోల్ లో చేయడం చూడాలని ఉందనేవారు.. నువ్వు విలన్ గా మారితే మూవీ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.. బిజీ అవుతావు ఒకసారి ప్రయత్నించాల్సిందని నాకు చెప్తూ ఉండేవారని.. మనోజ్ వివరించాడు. అదే ఇప్పుడు నిజమైంది అన్నట్లుగా మనోజ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మనోజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. పవన్ మనోజ్ మధ్యనే మొదటి నుంచి చాలా మంచి బాండింగ్ ఉంది. గతంలో వీళ్ళిద్దరి మధ్యన అనుబంధానికి సంబంధించిన వీడియోస్ తెగ వైరల్ గా మారాయి. ఇక మిరాయ్‌ సినిమాతో మనోజ్ లైఫ్ చేంజ్ అయింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో పవన్ చేసిన సజెషన్ మనోజ్ ఫాలో అవ్వడంతోనే సక్సెస్ వ‌చ్చింద‌ని.. అనందం వ్యక్తం చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.