ఓవర్సీస్ ఓపెన్ బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న ‘ ఓజి ‘.. కూలి రికార్డ్ తుక్కు తుక్కు చేసిందిగా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి మూవీ రోజు రోజుకు క్రేజ్ అంతకు అంతకు పెంచుకుంటూ పోతుంది. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలను నెలకొల్పింది. సుజిత్ ఫ్లాప్ డైరెక్టర్ అయినా.. పవన్‌ తో సినిమా కావడం.. అది కూడా న్యూ గ్యాంగ్ స్ట‌ర్‌ డ్రామా జోన‌ర్లో వస్తుందని తెలియడంతో.. ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. కేవలం పవన్‌ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్‌లో సైతం సినిమాపై ఆసక్తి మొదలైంది. ఇక వీటన్నింటిని మించిపోయే రేంజ్‌లో గతంలో పవన్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా రిలీజ్ అయిన గ్లింప్స్‌ నేషనల్ రెస్పాన్స్ ద‌క్కించుకుంది.

Happy Birthday to the one and only @pawankalyan the epitome of talent, charisma, and dedication! ☺️ May this special day mark the beginning of another incredible year, filled with unparalleled success, unwavering

తాజాగా రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకోవడం విశేషం. ఈ క్రమంలోనే పవన్‌ నుంచి రానున్న ఓజి సినిమా ఆయనకు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తుందని.. మరోసారి మార్కెట్ డబల్ చేస్తుందంటూ ఫ్యాన్స్ గ‌ట్టి నమ్మకంతో ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే.. సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ఐదు రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సైతం ఓజీ మంచి రెస్పాన్స్ని దక్కించుకుంటుంది. ట్రేడ్ సమాచారం ప్రకారం ఐదు రోజుల ఓపెన్ బుకింగ్స్ లో ఓజికి రూ.8 లక్షల డాలర్ల వరకు వచ్చాయ‌ట‌.

Hari K 👑 on X: "Exclusive Update:- PAWAN KALYAN films Team Hari Hara Veera Mallu eyeing on Maha Shivaratri week to release the film... Team OG already announced that they will arrive

నేడు పవన్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. ఎలాగైనా ఈ సినిమా 1 మిలియన్ అందుకోవాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. అంతేకాదు.. 1 మిలియన్‌ను ఈ సినిమా నేటితో అందుకుంటే.. హైయెస్ట్ గ్రాస్ అతితక్కువ సమయంలో కొల్లగొట్టిన రికార్డు కూడా ఓజికి దక్కుతుంది. అయితే.. ఇప్పటికే ఓజి ఖాతాలో ఓ క్రేజి రికార్డ్ చేరిపోయింది. ఈ ఏడాదిలోనే హైయెస్ట్ గ్రాస్ కొల్లగొట్టిన కూలీ సినిమా నార్త్ అమెరికన్ ప్రీమియర్ షోస్ రికార్డుని బ్రేక్ చేసిందని అంటున్నారు. ఇక ఇప్పటివరకు నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ ప్రీమియర్స్ క్రాస్ మీ అందుకున్న ఇండియన్ సినిమాలు ఆర్ఆర్ఆర్, పుష్ప 2, కల్కి, కూలీ కాగా.. ఇప్పుడు ఓజి కూడా ఈ లిస్టులో చేరుకోవడం ఖాయమని చెబుతున్నారు ఫ్యాన్స్‌. ఇక‌ సినిమా పాజిటివ్ టాక్ వస్తే 200 కోట్ల క్రాస్ ను మొదటి రోజు కొల్లగొడుతుందని విశ్లేషకులు సైతం చెప్తున్నారు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.