ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్.. హైదరాబాద్ లో ఎక్కడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న మాస్ యాక్షన్ మూవీ ఓజి. ఈనెల 25న గ్రాండ్గా రిలీజ్ కానున్న‌ సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులే కాదు.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే సినిమాకు ఏ రేంజ్‌లో క్రేజ్‌ ఉందో అర్థమవుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పవర్ స్ట్రామ్‌ సాంగ్స్, గ్లింప్స్ అన్ని ఆడియన్స్ లో అంచనాలను ఆకాశానికెత్తేశాయి.

ఈ క్ర‌మంలోనే అభిమానుల కోసం.. మేకర్స్‌ మరో పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అదే ఓజీ. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 21న హైదరాబాద్‌.. యూసఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్స్ దగ్గర ఈవెంట్ ను గ్రాండ్గా నిర్వహించనున్నారని సమాచారం. ఈ వేడుకకు ప‌వ‌న్ తప్పకుండా హాజరుకానున్నారు. అలాగే.. విలన్ రోల్ లో నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ సైతం సందడి చేయ‌నున్నాడట.

ఇక స్పెషల్ గెస్ట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సందడి చేయునున్న‌ట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లో జరిగే ఈ ఫ్రీ రిలీజ్ వేడుకతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరో ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ లో మేకర్స్ ఉన్నారట. అయితే.. విజయవాడ లేదా విశాఖపట్నంలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పర్మిషన్స్ రావాల్సి ఉంది.