రిలీజ్‌కు 20 రోజుల ముందే ‘ OG ‘ ఊచకోత.. ఎన్ని వేల టికెట్లు అంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ కాల్ హిమ్ ఓజి. ఈ సినిమా రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్‌తో పాటు.. సాధార‌ణ‌ ఆడియన్స్ ట్రేడ్ వర్గాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్గా మెర‌వ‌నున్న ఈ మూవీ సెప్టెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఉత్తర అమెరికా ప్రీమియర్ షో ఓపెనింగస్ మొద‌లై.. టికెట్లు అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తుంది. టీం అఫీషియల్ గా ప్రకరించిన సమాచారం ప్రకారం.. ఓపెన్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయట‌.

ఉత్తర అమెరికాలోనే ఇప్పటికీ వన్ మిలియన్ డాలర్ క్రాస్ చేసినా రికార్డ్ పవన్ సొంతం చేసుకున్నాడు. దీంతో.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోను పవనిజం ఏ రేంజ్‌లో ఉందో క్లారిటీ వచ్చేస్తోంది. ఇక సినిమాలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హ‌ష్మీ విలన్ పాత్రలో మెరవ‌నున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా పవన్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్‌లో ఆయన లుక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఆయన పాత్ర సినిమాలో మరింత పవర్ఫుల్ గా ఉండనుందని అంచనాలు ఆడియన్స్‌లో మొదలైపోయాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య, దాసరి కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

థ‌మన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇక ఇప్పటికే థ‌మన్ నుంచి వచ్చిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్‌ సాంగ్స్ అన్ని ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమాలో శ్రేయ రెడ్డి, ప్రకాష్ రాజా, అర్జున్ దాస్ కీలక పాత్రలో మెర‌వ‌నన్నారు. పవన్ ఇంతకుముందు ఎప్పుడు చూడ‌ని ఓ ఇంట్రెస్టింగ్ లుక్‌తో అభిమానుల ముందుకు రానున్నాడని ట్రైలర్ లోనే క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాకు 20 రోజులు మిగిలి ఉండగానే ఈ రేంజ్‌లో 40 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం అంటే ఈ 20 రోజుల్లో మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో.. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలుసుకోవాలని ఆసక్తి పవన్ అభిమానులలోను మొదలైంది.