” మిరాయ్ ” మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్ అదేనా.. వదిలేసి మంచి పని చేశారు..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజసజ్జ.. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన మూవీ మిరాయ్‌ లేటెస్ట్‌గా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ, హిందీ, మ‌ళ‌యాళ భాషల్లోనూ నిన్న రిలీజై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసినా మిరాయ్ పేరు మారుమోగిపోతుంది. సోషల్ మీడియా నుంచి ఇండస్ట్రీ వర్గాల వరకు ప్రతి ఒక్కరిలోనూ ఈ సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో ఏ భారీ బడ్జెట్ సినిమాకు కూడా లేని రేంజ్‌లో విజువల్ ట్రీట్ అందరినీ ఆకట్టుకుంటుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా ఈ రేంజ్‌లో సక్సెస్ అవడానికి మేకర్స్‌ కృషి కూడా ఎంతో ఉంది. సినిమా కేవలం తరికెక్కించడమే కాదు.. ప్రమోట్ చేయడంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు టీం.

Teja Sajja's Mirai Ending Explained: Is Mahabir Lama Still Alive After The  Fight Against Veda?

ఈ క్ర‌మంలోనే సినిమా టైటిల్ విష‌యంలోను ఓ స్ట్రాటజీని ఫాలో అయ్యార‌ట‌. ఇటీవల కాలంలో తెర‌కెక్కుతున్న సినిమాలకు డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ల వరకు వినూత్నమైన టైటిల్స్ పెట్టి సినిమాపై క్యూరియాసిటీ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ టైటిల్ అర్థమేంటనే ఆసక్తి అభిమానుల‌లో కలిగేలా చేస్తున్నారు. ఇప్పుడు మిరాయ్‌ సినిమా విషయంలోనూ మేకర్స్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో చేశారని తెలుస్తుంది. అయితే.. మొదట ఈ సినిమా కోసం మిరాయ్‌ కాకుండా మరో టైటిల్ ని అనుకున్నారట. ఇంతకీ అస్సలు మిరాయ్‌ అర్థం ఏంటి.. మిరాయ్ కంటే ముందు ఈ సినిమాకు అనుక్కున్న టైటిల్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మీరాయ్ జ‌పాన్ ప‌దం.దీనికి భవిష్యత్తు అనే అర్థం వస్తుంది.

Teja Sajja Injured During 'Mirai' Shoot in Sri Lanka, Plans to Continue  Filming

కానీ.. భాషలను బట్టి పదానికి అద్దాలు కూడా మారుతూ ఉంటాయి. ఇక టైటిల్‌కు సూపర్ యోధ అనే ట్యాగ్న కూడా తగిలించారు. కాగా మొద‌ట ఈ టైటిల్‌కు బదులుగా వేద అనే టైటిల్ ని పెట్టాలని అంతా భావించారట. కానీ.. వేద అంటే చాలా షార్ట్ అండ్ సింపుల్ టైటిల్ గా ఉంది. ఇది సినిమాపై పెద్దగా ఆడియన్స్ లో హైప్‌ క్రియేట్ చేయలేదని భావించడంతో.. మేకర్స్ కంటెంట్ కు సరిపోయేలా 300 కు పైగా టైటిల్స్ సెర్చ్ చేసి.. చివరకు మిరాయ్ ఫిక్స్ అయ్యారు. ఈ పదం కొత్తగా ఉండడం.. థ్రిల్ ఫీలింగ్ ను కలిగించడంతోపాటు.. సినిమాకు కావాల్సిన గ్రిప్ మిస్టరీ కూడా అందిస్తుందని నిర్ణయాన్ని తీసుకున్నారట టిం. ఇప్పుడు వాళ్ళ డెసిషన్ 100% కరెక్ట్ అని తాజాగా వచ్చిన రివ్యూలు, ఫస్ట్ డే కలెక్షన్లతో రుజువైపోయింది. అంతే కాదు.. హనుమాన్ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత మీరాయ్‌తో తేజ సజ్జ ఖాతాలో మరో సూపర్ హిట్ ఖాయమని సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.