టాలీవుడ్ ఇండస్ట్రీ హీరో నుంచి పాన్ ఇండియన్ సక్సెస్ అందుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇప్పటివరకు ఆ రేంజ్‌లో చాలా తక్కువ మంది మాత్రమే నిలిచారు. వారిలో ప్రభాస్, బన్నీ, చరణ్, తారక్ లాంటి టాప్ స్టార్స్ మాత్రమే హిందీ బెల్ట్ లో సత్తా చాటుకుని బ్లాక్ బస్టర్ లెవెల్ వసూళ్లను కొల్లగొట్టారు. కానీ.. ఇప్పుడు వాళ్ళ జాబితాలోకి యంగ్ హీరో.. తేజ సజ్జా కూడా చేరిపోయడనటంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇదే న్యూస్ ఇండస్ట్రీలను హాట్ టాపిక్ గా మారింది. తాజాగా తేజ సజ్జా నుంచి రిలీజ్ అయిన మిరాయ్ సినిమా.. కేవలం నార్త్ బెల్ట్ లోనే దాదాపు రూ.10 కోట్ల మార్క్ దాటేయడం విశేషం. తేజ కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ లోనే ఇదో రేర్ రికార్డు అనడంలో అతిశయోక్తి లేదు.ఇప్పటివరకు ఈ ఫీట్ సాధించిన టాలీవుడ్ హీరోలలో కేవలం నలుగురి పేర్లు ఉన్నాయి. అలాంటి ఓ స్ట్రాంగ్ కాంపిటీషన్‌లో తేజ సజ్జా ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోవడం.. అతని మార్కెట్ కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మిరాయ్ కేవలం తెలుగు రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతూ రిజల్ట్ ను క్లియర్ గా చూపిస్తుంది. అడ్వెంచర్, మైథిలాజికల్, సూపర్ హీరో అంశాలు కలగలిపిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా.. మిరాయ్‌తో నార్త్ బెల్ట్‌లో వచ్చిన ఈ రేంజ్ వసూళ్లు.. తేజ మార్కెట్ ఏంటో చూపిస్తున్నాయి. ఎలాంటి హీరో అయినా పాన్ ఇండియా లెవెల్లో వరుస సక్సెస్‌లు అందుకోవడం అంతా సులువు కాదు. కానీ.. తేజ సజ్జ వరుసగా హనుమాన్, మిరాయ్ లతో బ్లాక్ బస్టర్లు అందుకొని రేర్ రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఈ సక్సెస్‌కు మరో కారణం విజువల్స్, కథనం, యాక్షన్, స్క్రీన్ ప్లే. కార్తిక్ పెట్టిన ఎఫర్ట్స్. ప్రతి ఒక్కటి ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. సినిమాపై బలాన్ని మరింత పెంచింది. అలా సినిమా మూడు రోజులు ముగిసే సరికి వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.81 కోట్లను దాటేయగా.. హిందీ బెల్ట్ లో రూ.10 కోట్లకు పైగా గ్రాస్ రావడం విశేషం. చిన్న వయసులోనే ఈ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటున్న తేజ కెరీర్ గ్రౌండ్.. ముందు ముందు ఎలా నిలబెడతాడో.. ఏ రేంజ్ లో సక్సెస్‌లు అందుకుంటాడో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో మరింత బిగ్ స్టార్‌గా మారాలని.. కచ్చితంగా మరిన్ని సక్సెస్‌లు అందుకోవాలని అభిమానులు తమ విషెస్ తెలియజేస్తున్నారు.
హిందీలో మిరాయ్ సెన్సేషన్.. బడా హీరోల లిస్టులో తేజ సజ్జా
