టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా.. కార్తీక్ ఘట్టబనేని డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మిరాయ్. మంచు మనోజ్ విలన్‌గా నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది. ఫాంటసి థ్రిల్లర్‌గా రిలీజై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. రోజురోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ పోతుంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు.. రూ.400 కోట్ల రేంజ్ లో విఎఫ్ఎక్స్ ఉందని తేజ సజ్జా పెర్ఫార్మన్స్. మంచు మనోజ్ యాక్షన్ అదిరిపోయాయి అంటూ.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గుస్ బంప్స్ ఖాయం అంటూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు క్రేజ్ అంతకు అంతకు పెరిగిపోయింది.
ఇక నిన్న సెప్టెంబర్ 15న కలెక్షన్స్ మరింతగా పుంజుకున్నాయి. కాగా తాజాగా.. మేకర్స్ మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ల పోస్టర్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో ఏకంగా రూ.81.20 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని టీం వెల్లడించారు. ఇండియా నుంచి ఇంటర్నేషనల్ వరకు మిరాయ్ ప్రతి చోటా చరిత్ర సృష్టిస్తుందని టీం వివరించారు. బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ మిరాయ్ అంటూ పోస్టర్‌తో పాటు.. మేకర్స్ వెల్లడించారు. ఇక మిరాయ్ మొదటి రోజే రూ.27 కోట్ల కలెక్షన్లు రాగా.. రెండవ రోజు ఏకంగా రూ.28.4 కోట్ల కలెక్షన్లు దక్కాయి.
ఇక మూడవ రోజు మిరాయ్ రూ.25.6 కోట్ల రేంజ్ లో వసూలు దక్కించుకుంది. అలా.. రెండో రోజుకి రూ.55 కోట్ల గ్రస్స్ కొల్లగొట్టి.. మూడవ రోజు పూర్తయ్యేసరికి రూ.81,20 కోట్లు దక్కించుకుంది. ఇక ఇండియాలో మొదటి రోజు రూ.13 కోట్లు రెండవ రోజు రూ.14.5 కోట్లు, మూడవరోజు ఏకంగా రూ.16.25 కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుకుంటున్న మిరాయ్.. ఇండియా మొత్తంలో రూ.44 .75 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్లో సైతం ఈ మూవీ దూసుకుపోతుంది. ఫుల్ రన్లో ఈ యంగ్ హీరో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో.. ఏ రేంజ్లో సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.