రిలీజ్ కు ముందే రికార్డ్ క్రియేట్ చేసిన మీరాయ్.. IMDbలో నెంబర్ 1గా..

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా తాజాగా మీరాయ్‌ సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్‌ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఘట్టమ‌నేని డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పింది. తాజాగా.. సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మీరాయ్.. మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాలలో మొదటి స్థానాన్ని దక్కించుకుందని.. ఐఎండిబి వెల్లడించింది.

ఈ విషయాన్ని మీరాయ్‌ మేకర్స్ అఫీషియల్‌గా సోషల్ మీడియా వేదికగా పోస్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. సెప్టెంబర్ 12, 2025న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ లో ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో చూడాలి. ఇక ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నారు. జగపతిబాబు, జయరాం, శ్రియ శరన్ కీలక పాత్రలో ఆకట్టుకోనున్నారు.

Mirai Trailer: A Visual Spectacle with Teja Sajja - ManaTelugu

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా.. భారీ బడ్జెట్‌తో ఎక్కడ క్వాలిటీ దెబ్బతినకుండా నిర్మించారు. గౌరీ హర ఏ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విజువల్ బ్లాస్ట్ కాయమని.. సినిమాలో ప్రతి ఒక్క సీన్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్‌ తెప్పిస్తుందని.. కంటెంట్ కూడా చాలా ఆసక్తి కలిగించేలా డిజైన్ చేశారంటూ సెన్సార్ సభ్యులు వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సినిమా హనుమాన్‌పు మించి బ్లాక్ బ‌స్టర్ కాయమంటూ అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.