టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూసర్లుగా ఈ సినిమానే తెరకెక్కించారు. ఇక సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విలన్ పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపించారు. శ్రీయా, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు మెరిసారు. ఇక ఈ సినిమాతో తేజా సజ్జ, మనోజ్ హిట్ కొట్టారా..? సినిమా ఎలా ఉంది..? రివ్యూలో చూద్దాం.
స్టోరీ:
అశోక చక్రవర్తి తన పొందిన జ్ఞానాన్ని 9 గ్రంథాలుగా రచించాడు. ఆ తొమ్మిది గ్రంథాలు ఒక్కొక్కచోట ఒక్క గ్రంథాన్ని రక్షణ కవచంలా మహిమాన్విత శక్తులు ఉన్న వ్యక్తుల దగ్గర ఉంచాడు. ఇక ఆ కవచాలని దాటుకుని ఒక్కో గ్రంథాన్ని సొంతం చేసుకోవాలని మహావీర్ లామ (మంచు మనోజ్) చూస్తాడు. అమరత్వానికి సంబంధించిన ఈ తొమ్మిది గ్రంథాలను సొంతం చేసుకోవడం అంతా సులభమైన విషయం కాదని తెలిసిన.. దానికోసం ప్రయత్నాలు మొదలెడతాడు. ఈ 9 గ్రంథాల్లో చివరిదానికి కవచంలా.. అంబిక (శ్రియ శరణ్) ఉంటుంది.
ఇక మహావీర్ నుంచి వచ్చే ముప్పును ముందుగానే గ్రహించిన అంబికా.. ఈ క్రమంలోనే అతని ఎదుర్కోవడానికి జన్మనిచ్చిన బిడ్డను.. వేద(తేజ సజ్జ)ను దూరం చేసుకుని వెళ్లిపోతుంది. వారణాసి, కలకత్తా, హైదరాబాద్ వివిధ నగరాల్లో వేద పెరిగి పెద్దవాడవుతాడు. అయితే.. అసలు వేద.. అంబిక పుత్రుడు అని ఎప్పుడు తెలుసుకుంటాడు..? మహావీర్ లామా ను వేద ఎలా ఎదిరించాడు..? వేద నుంచి యోధగా ఎలా మారాడు..? సినిమా ఆధ్యాంతం మలుపులతో చివరికి ఏ మజిలీ చేరుకుంది..? ఇక మహావీర్, యోధల మధ్య జరిగే వార్‌లో యోధ ఎలా గెలిచాడు.. అనేదే కథ.
రివ్యూ:
బలవంతుడైన విలన్‌ను బలహీనుడైన హీరో తెలివిగా గెలిచినప్పుడే.. అసలైన హీరోయిజం ఎలివేట్ అవుతుంది. ఇక ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఇప్పటికే ఎన్నో సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఒక్క జానెర్ కాదు.. కమర్షియల్, డివోషనల్, సూపర్ హీరో ఇలా.. ఏ జోనర్ అయినా సరే.. విలన్ పవర్ ఫుల్ గా ఉండాలి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే.. పవర్ఫుల్ విలన్ అయితే సరిపోదు.. విలన్ అంత పవర్ ఫుల్ గా కనిపించడానికి వెనుకున్న రీజన్ కూడా ఆడియన్స్ కు కనెక్టెడ్ గా ఉండాలి. కానీ.. మీరాయ్‌లో ఈ పాయింట్ మిస్ అయ్యిందనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగిన కథకు.. సెకండ్ హాఫ్ లో బ్రేక్ పడినట్లు అయింది.
ఇక మంచు మనోజ్ పాత్ర పరిచయంతో మొదలైన సినిమా.. ప్రతి 15 నిమిషాలకు ఒక ఫైట్.. లేదా ట్విస్టుతో ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచుతూ పోయింది. అయితే.. కార్తీక్ చేసిన బిగ్ మిస్టేక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్లో చేయడమే. కానీ మీరాయ్ శక్తితో తేజ సజ్జ ఫైట్ చేయడం మొదలైన తర్వాత మూవీ మళ్లీ ట్రాక్ లో పడినట్లు అనిపిస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ బాగా వర్కైట్ అయ్యాయి. ఇక వేద నుంచి యోధగా మారే ఈ జర్నీలో , సంపతి పక్షి దగ్గర వేద పడిన మానసిక సంఘర్షణ.. తెరపై కార్తీక్ సరిగ్గా చూపించలేకపోయాడనిపించింది. తేజ సజ్జా స్టైల్, వైబ్ మూత్‌కు కనెక్ట్ చేయడం కోసం డైరెక్టర్ రాసిన ఫైట్స్, కామెడీ సీన్స్ అంతగా క్లిక్ అవ్వలేదు. క్లైమాక్స్ లో రాముడు ఎంట్రీ అదిరిపోయింది. ఫేస్ రివిల్ చేయకున్నా ఆడియన్స్ ను సీన్ ఆకట్టుకుంటుంది.
నటీనటుల పర్ఫామెన్స్:
తేజ సజ్జ ఈ జనరేషన్ యువకుడు వేదగా.. యోధుడిగా 2 వేరియేషన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. సూపర్ యోధాలా ఒకేసారి లాక్.ర్‌థెన్ లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ చేయకుండా.. మెల్లమెల్లగా కుర్రాడి నుంచి యోదాగా కన్వర్ట్ అయ్యే జర్నీని తన నటనతో చక్కగా ఆవిష్కరించాడు. ఈ క్రమంలోనే అతని తల్లి గురించి తన తుది లక్ష్యం గురించి తెలుసుకునే సీన్స్ ఆడియన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటాయి. మంచు మనోజ్ స్క్రీన్ టైం తక్కువే అయినా.. తెరపై కనిపించిన ప్రతిసారి ఒక స్టైల్, స్వాగ్‌తో దూసుకుపోయాడు. ఈ సినిమాలో తన పాత్రకు అవసరమైన నటన చూపించ్చాడు. ఇక మనోజ్ స్టైల్, లుక్ అందరిని ఆకట్టుకుంటాయి.
శ్రియ పాత్ర.. హీరోకి తల్లిగా కథలో కీలకమైన డివైన్డ్ ఇంటెన్స్ రోల్‌ను 100% ఎఫర్ట్స్‌తో పూర్తి చేసింది. ఆ పాత్ర తాలూకా గాఢత ఆమె నటనలో క్లియర్గా అర్థమవుతుంది. కాగా హీరోయిన్గా రితిక నాయక్ తన పాత్ర 100% ఇవ్వడానికి ప్రయత్నించినా.. కొన్నిచోట్ల డైలాగ్స్ తో లిప్ సింప్ కుదరకపోవడం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీంతో అమ్మడి నటన యావరేజ్ గా అనిపించింది. ఇక జగపతిబాబు, జై రామ్ తమ పాత్రకు తగ్గట్టు మెప్పించారు. హీరో ఫ్రెండ్ రోల్‌లో గెటప్ శీను ఆడియన్స్‌ను నవ్వించాడు. అయితే.. పోలీస్ పాత్రలో నటించిన డైరెక్టర్ కిషోర్ తిరుమల, వెంకట్ పాత్రలు కేవలం ఆడియన్స్ను నవ్వించేందుకే అనిపించాయి. కొన్నిచోట్ల ఆ కామెడీ సీన్స్ ఫెయిల్ అయ్యినా.. మరికొన్ని చోట్ల బానే పేలాయి.
టెక్నికల్ గా:
సినిమాకు రచయితగా, సినిమాటోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా కార్తీక్ ఘట్టమనేని మీరాయ్ కోసం త్రీ రోల్స్ చేశాడు. ఇక ఈ మూడిటిలో రచయితగా కార్తీక్ కళింగ యుద్ధం.. అశోక చక్రవర్తి 9 గ్రంథాలు రక్షణ.. కవచాలుగా అతీత శక్తులు ఉన్న వ్యక్తుల గురించి రాసుకోవడం బాగుంది. కానీ.. విలన్ ఫ్లాష్ బ్యాక్ ను రాయడంలో కాస్త తడిపడినట్లు అనిపిస్తుంది. కార్తీక్ ఘటమనేని రచనకు అతని స్వయం సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అయిందని చెప్పాలి.
కథ అనుగుణంగా ఎన్నో లొకేషన్లు షూటింగ్ అలాగే.. విఎఫ్ ఎక్స్ వర్క్స్, విజువల్స్, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే ఈ రేంజ్ లో రిచ్ విజువల్స్ సాధ్యమయ్యేది కాదు. కెమెరా వర్క్ విషయంలో కార్తీక్ ఘట్టమనేని 100% ఇచ్చారు. అయితే కథతో పాటు కామెడీ ప్లాన్ చేసిన వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్‌తో పెంచిన క్యూరియాసిటీని.. సెకండ్ హాఫ్ లో అంతే రేసింగ్‌గా చూపించలేకపోయాడు. ఇక మీరాయ్‌కు కూడా హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరినే పని చేశాడు. ఇక సినిమాలో సాంగ్స్ మంచి వైబ్‌లో సినిమాకు సంబంధం లేకుండా పాటలు సాగాయి.
ఈ క్రమంలోనే సాంగ్స్ కంటే హరి గౌరీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్గా మారింది. మరీ ముఖ్యంగా డివోషనల్ సీన్లకు ఇచ్చిన బిజిఎం నెక్స్ట్ లెవెల్. పీపుల్ మీడియా పెట్టిన ఖర్చులు, విఎఫ్ఎక్స్ విషయంలో తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్త తెరపై కళ్ళకు కట్టినట్లుగా కనిపించాయి. పక్షి ఎపిసోడ్ అయితే మరింత ఆకట్టుకుంది. మంచు మనోజ్ కత్తి సౌండ్, ఫైట్స్ దగ్గర విఎఫ్‌ఎక్స్ వర్క్ ఆకట్టుకుంది. ఇక సినిమాటోగ్రాఫర్ గా.. శ్రీకర ప్రసాద్ మంచిగా కత్తిర పెట్టారు. కానీ.. రన్ టైం కాస్త తగ్గించినా బాగుండేదన్న ఫీల్ కలిగింది.
ప్లస్ లు:
విజువల్స్, తేజ సజ్జ – మనోజ్ పెర్ఫార్మెన్స్, సరికొత్త కథ, ఆకట్టుకునే సన్నివేశాలు, సీన్స్‌కు తగ్గ బ్యాగ్రౌండ్ మ్యూజిక్
ప్లస్ అయ్యాయి.
మైనస్ లు:
రన్నింగ్ టైం ఎక్కువగా అనిపిస్తుంది. కామెడీ క్లిక్ కాకపోవడం మరింత మైనస్. విలన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మెప్పించాయి.
ఫైనల్ గా: లార్జర్‌థెన్ లైఫ్ ఉన్న గ్రాండ్ స్కేల్ విజువల్ సినిమా.. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు.