” కిష్కింధపురి ” మూవీ రివ్యూ.. బెల్లం బాబు హారర్ థ్రిల్లర్ మెప్పించిందా..!

టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ కాంబోలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ కిష్కింధ‌పూరి. కౌశిక్ పగళ్ల‌పాటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో సాండీ మాస్టర్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, సుదర్శన్ తదితరులు కీలకపాత్రలో మెరిసారు. ఎస్ఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్ పై సాహుగారపాటి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయింది. అయితే.. ఈ సినిమా ప్రీమియర్ షోస్‌ ఇప్పటికే ముగిసాయి. ఇక ఈ సినిమాతో బెల్లంబాబు ఆడియన్స్‌ను మెప్పించాడా.. లేదా..? కిష్కింధ‌పురి ఎలా ఉంది..? రివ్యూలో చూద్దాం.

From flop to hope: Anupama Parameswaran's big test with Kishkindhapuri

కథ:
రాఘవ (బెల్లంకొండ శ్రీనివాస్) మైథిలి (అనుపమ పరమేశ్వరున్‌) ఇద్దరు లవర్స్. ఒక చోటే ప‌నిచేస్తూ.. హ‌ర‌ర్ హౌస్ కాన్సెప్ట్‌తో లేని దెయ్యాల‌ను సృష్టించి జ‌నానికి కిక్ ఎక్కిస్తుంటారు. ఈ జంట.. ఒకసారి కిష్కింధ‌పురి సువర్ణ మాయ రేడియో స్టేషన్కు ఎంట్రీ ఇస్తారు. వాళ్లతో పాటు మరో ఎనిమిది మంది ఉంటారు. అప్పటి వరకు వాళ్లు సెట్ చేసిన దెయ్యాలు.. కేవలం మాయ కాబట్టి ఏమి జరగదు. కానీ.. అక్కడ నిజంగానే ఒక ఆత్మ ఉంటుంది. కిష్కింధపురి ఊరిలో సువర్ణ‌మాయ రేడియో స్టేషన్ నుంచి వచ్చే వింత శబ్దాలు విని చుట్టుపక్కల వాళ్లు అటు వెళ్లడానికి కూడా భయపడతారు. కానీ.. రాఘవ బ్యాచ్ మాత్రం ధైర్యంగా అక్కడికి వెళ్తారు. ఒక్కొక్కరిగా అందరూ చనిపోతూ ఉంటారు. ఇక రేడియో స్టేషన్ నుంచి రాఘవ, మైధిలి ఎలా తప్పించుకున్నారు..? అసలు అక్కడ ఏం జరుగుతుంది..? రేడియో స్టేషన్ లో 1989లో ఏం జరిగింది..? ఇంతకీ ఆ ఆత్మ కథ ఏంటి..? అనేది సినిమాలో చూడాల్సిందే.

రివ్యూ:
హారర్ థ్రిల్లర్ సక్సెస్.. కథ‌కన్నా, కథనంతో ముడిపడి ఉంటుంది. కంటెంట్ వర్కౌట్ అయితే హిట్ కొట్టేస్తుంది. కిష్కింధపురి విషయంలో ఇది అసలు వర్కౌట్ కాలేదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా మొదలైన కథ‌. ముఖ్యంగా మొదటి పది నిమిషాలు ఆకట్టుకుంది. ఇక 1989 కథ మొదలైన వెంటనే వింత శబ్దాలు, సౌండ్ ఎఫెక్ట్స్ తో అక్క‌డ‌క్క‌డ భ‌య‌పెడుతూ.. ఆడియ‌న్స్‌లో ఆశ‌క్తిపెంచేలా మొదలైన కథ‌.. తర్వాత 20 నిమిషాలు నీరసంగా నడిచింది. అసలు సన్నివేశానికి సంబంధం లేకుండా.. ఏదో పెట్టాలని మ‌ధ్య‌లో పెట్టేసిన సాంగ్ సినిమాకు వర్కౌట్ కాలేదు. చూసే ఆడియన్స్ కు అనవసరంగా సాంగ్ పెట్టారనే ఫీల్ కలుగుతుంది. ఇక మొదటి అరగంట పూర్తయిన తర్వాత అసలు గేమ్ మొదలైంది.

Music promotions begin for 'Kishkindhapuri' | Telugu Cinema

ఇంటర్వెల్ వరకు వేగంగా సాగిన స్టోరీ అద్యంతం భయపెడుతూ.. ట్విస్ట్‌ల‌తో ఆడియన్స్‌ను సీట్ ఎడ్స్‌కు తీసుకువెళ్లింది. స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైన్ సీన్ అయితే అదిరిపోయింది. సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ ఫ్లాష్ బ్యాక్. ఇది చాలా వీక్ గా అనిపించింది. దెయ్యానికి ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రొటీన్ స్టోరీ.. కథ వింటుంటే కాంచన స్టోరీ చాయలు కనిపించాయి. ఆ తర్వాత కూడా సినిమా నీరసంగానే ఉంది. ప్రీ క్లైమాక్స్ వరకు కూడా నరేషన్‌ చాలా స్లోగా సాగింది. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ.. సినిమాలో ఉండే కొన్ని సీన్స్ మాత్రం ఆడియ‌న్స్‌కు చూడాలనిపించేలా రూపొందించారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే హారర్ సీన్స్ అయితే.. నెక్స్ట్ లెవెల్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ స్మశానం సీన్ కూడా ఆడియ‌న్స్‌ను భయపెడుతుంది. టెక్నికల్గా కిష్కింధ‌పురి ఆకట్టుకున్నా.. కథపరంగా ఆకట్టుకోలేకపోతుంది.

నటీనటుల పర్ఫామెన్స్:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నటనతో మెప్పించాడు. యాక్షన్, ఎమోషన్ ఇలా ప్రతి సీన్‌లొను 100 % ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. ఇక అనుపమ పరమేశ్వరన్ సినిమా అంతా ఒక లెవల్ అయితే.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంది. సాండీ మాస్టర్ నటనతో అదరగొట్టాడు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ లోకా తర్వాత.. మరో ఖతర్నాక్ క్యారెక్టర్ సాండికి పడింది. హైపర్ ఆది కామెడీ ఆడియన్స్‌ను నవ్వించింది. సుదర్శన్ పర్వాలేదు. శ్రీకాంత్ అయ్యంగర్‌ పర్లేదు అనిపించుకున్నా.. మిగతా నటినటులు పాత్రకు తగ్గట్టు నటించారు.

அனுபமா நடிக்கும் ஹாரர் படத்தின் முதல் கிளிம்ப்ஸ் - வைரல்|Kishkindhapuri  First Glimpse – A chilling welcome to horror

టెక్నికల్ గా:
చైతన్య భరద్వాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్. హారర్ సీన్స్‌ను ఎలివేట్ చేయడంలో బిజీఏం మరింత సక్సెస్ అయింది. విజువల్స్ కూడా మెప్పించాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయంలో మాత్రం కాస్త తడబడ్డారు. కౌశిక్ పగళ్ల‌పాటి డైరెక్షన్ ఫస్ట్ హ‌ఫ్ మెప్పించినా.. కీలకమైన సెకండ్ ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద దెబ్బ పడింది. సెకండ్ హాఫ్ అక్క‌డ‌క్క‌డ ట్విస్టులు బాగున్నా.. కంటెంట్ ఆకట్టుకోలేకపోయింది. క్లైమాక్స్ రొటీన్ గా ఉన్నా.. సీక్వెల్ పై ఇచ్చిన హింట్ ఆసక్తిగా అనిపించింది. రాముడి ఎపిసోడ్ ఓకే.

ప్లస్ లు:
బెల్లంకొండ, అనుపమ పర్ఫామెన్ న‌ట‌న‌, హారర్ సీన్స్ కు ఇచ్చిన బిజిఎం, విజువల్స్

మైనస్లు..:
సెకండ్ హాఫ్, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, కథనం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. క్లైమాక్స్ వీక్ (ముందే ఊహించొచ్చు).

ఫైనల్ గా: జనాని సగం భయపెట్టి.. వదిలేసిన హారర్ కథ కిష్కింధ‌పురి.