తేజ సజ్జా అనుభవిస్తున్న ఈ సక్సెస్ అసలు మోక్షజ్ఞకు దక్కాల్సిందా.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు పరిచయాలు అవసరం లేదు. ఇక ప్ర‌స్తుతం బాలకృష్ణ మాత్రం సినిమాలపై సినిమాలు చేస్తే దూసుకుపోతుంటే.. కొడుకు మోక్షజ్ఞ మాత్రం ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ ఎంట్రీనే ఇవ్వలేదు. ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరో తేజ స‌జ్జా వ‌రుస స‌క్స‌స్‌ల‌కు మోక్ష‌జ్ఞ‌తో ముడిపెడుతూ.. తేజ స‌జ్జా అనుభవిస్తున్న సక్సెస్ అంతా మోక్షజ్ఞ‌కు దక్కాల్సిందని.. అది ల‌క్కిగా తేజ సబ్జా కొట్టేసాడంటూ న్యూస్ వైరల్‌గా మారుతుంది. అసలు మేటర్ ఏంటంటే.. ప్రశాంత్ వర్మ బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 1 షో చేస్తున్న టైంలో హనుమాన్ స్టోరీని మోక్షజ్ఞకు వినిపించడట‌.

Hanu-Man - Wikipedia

కానీ బాలయ్య‌ మాత్రం దేనికి నో చెప్పేసాడు. దీంతో ఈ ప్రాజెక్టు ప్రశాంత్ వర్మ.. తేజతో చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక మీరాయ్ సైతం.. మొద‌ట మోక్షజ్ఞతో చేయాలని డైరెక్ట‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని భావించాడట. అయితే.. బాలకృష్ణనే ఈ జానర్.. అతనకు సెట్ కాదని.. దీన్ని కూడా రిజెక్ట్ చేశాడు. దీంతో తేజకు స్టోరీ వెళ్లడం.. తేజ సజ్జ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమాలో నటించడం జరిగింది. ఇక సినిమా ఇప్పుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్లే.

After HanuMan, Teja Sajja returns as super yodha in Mirai | The Pioneer

అలా.. మొదట ఈ రెండు సక్సెస్ లు మోక్షజ్ఞకు దక్కాల్సింది. కానీ.. తేజ సజ్జ ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హీరోగా మారిపోయాడు. ఇక ఇప్పటికి కూడా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే దానిపై క్లారిటీ లేదు. నందమూరి అభిమానులు సైతం ఈ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ప్రశాంత్ వర్మనే ఇవ్వనున్నట్టు మొదట్లో అనౌన్స్మెంట్ వచ్చినా.. ఇప్పటివరకు దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. అసలు మోక్షజ్ఞ ఇంకా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు.. ఆయన ఎంట్రీ ఉంటుందా.. లేదా.. అనే సందేహాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.