టాలీవుడ్ దర్శకుడాగా రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు తాను తెరకెక్కించిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకుని తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే కేవలం పాన్ ఇండియా అభిమానులు కాదు.. పాన్ వరల్డ్ రేంజ్లో ఉన్న తెలుగు ప్రేక్షకులంతా రాజమౌళి సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్‌ను టార్గెట్ చేసుకొని మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక మరో పక్కన.. టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన తేజ ప్రస్తుతం స్టార్ హీరోగా అవతరించి.. హనుమాన్, మిరాయ్ లాంటి బ్లాక్ బస్టర్లతో పాన్ ఇండియా లెవెల్లో గొప్పగా తనని తాను ఎలివేట్ చేసుకున్నాడు. ఇక మీదట కూడా తాను చేయనున్న సినిమాలపై ఆడియన్స్ లో మంచి హైప్‌ను క్రియేట్ చేశాడు. సూపర్ హీరో సినిమాలను ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. బడ్జెట్ కాదు.. కంటెంట్ ముఖ్యమని తాను నటించిన ప్రతి సినిమాతోనూ రుజువు చేస్తూ.. స్టోరీ సెలెక్షన్ విషయంలో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలో.. తన ఫ్యూచర్ సినిమాలతో ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటాడో.. ఏ రేంజ్ లో స్టార్ హీరోగా అవతరిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
అయితే.. ఇలాంటి క్రమంలోనే రాజమౌళికి, తేజ సజ్జకు మధ్యన మంచి బంధుత్వం ఉందని.. రాజమౌళి కారణంగానే తేజసజ్జ ఇండస్ట్రీలో ఇంత ఈజీగా సర్వైవ్ అవుతున్నాడు అంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ.. రాజమౌళికి, తేజకు మధ్యన ఉన్న బాండింగ్ ఏంటో.. అసలు మేటర్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. రాజమౌళి తేజ సజ్జాకు బ్యాక్ బోన్‌గా నిలబడినట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరి మధ్యన మంచి సంబంధం ఉందట. దూరపు చుట్టారికం ఉందని.. తేజ సజ్జ, రాజమౌళికి వరుసకు తమ్ముడు అవుతాడని సమాచారం. ఈ క్రమంలోనే రాజమౌళి ఇప్పటికీ తేజాకు సపోర్ట్ అందిస్తూనే ఉన్నాడట. తేజ సజ్జ సక్సెస్ అవ్వడానికి కూడా తానే కారణం అంటూ తెలుస్తుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంంతో తెలియదు కానీ.. తేజ సబ్జా మాత్రం రాజమౌళి సపోర్ట్ కంటే ఎక్కువ తన టాలెంట్ తోనే ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.