ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది.. ఎవరి లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో ఎవరు చెప్పలేరు. ఒకరు వద్దనుకున్న అవకాశం మరొక్కరికి గోల్డెన్ స్టెప్ గా మారి.. ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ను తెచ్చిపెడుతుంది. సరిగా.. ఇలాంటి సంఘటన టాలీవుడ్ యాక్టర్ సునీల్, నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో జరిగిందట. ప్రస్తుతం ఇదే టాక్ తెగ వైరల్ గా మారుతుంది. సునీల్ రిజెక్ట్ చేసిన ఓ కథ నాని కెరీర్‌ను యూటర్న్ తిప్పింది. అంతేకాదు.. అతని స్టార్ హీరోగా మార్చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. నాని హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్ మూవీ కోసం డైరెక్టర్ మారుతి.. మొదట సునీల్‌ను హీరోగా భావించాడట.
తన కామెడీ కథతో.. అప్పటికే అందాల రాముడు, మర్యాద రామన్న లాంటి బ్లాక్ బస్టర్‌లు అందుకుని మంచి ఫామ్‌లో ఉన్న సునీల్‌ను అప్రోచ్ అయ్యాడట. ఇక.. మారుతి చెప్పిన కథ కూడా సునీల్ కు బాగా నచ్చేసింది. హీరోకి మతిమరుపు అనే పాయింట్ ఆయనను ఆకట్టుకుంది. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఫిక్స్ అయ్యాడట. అయితే.. అప్పటికే హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ అయింది. కథలో కొన్ని యాక్షన్ సీన్స్ జోడించాలని మారుతీని సునీల్ అడిగాడట. కానీ.. కథ నేచురాలిటీ దెబ్బతీయ కూదరదని.. నేను అలాంటివి చేయలేనని మారుతి సున్నితంగా సునీల్ కు వద్దని చెప్పేసాడు.
స్టోరీలో ఎలాంటి మార్పులు చేయలేనని చెప్పడంతో సునీల్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పకున్నాడట. అలా సునీల్ వదిలిన కథతో నాని ఎంట్రీ ఇచ్చాడు. నాని కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎలాంటి మార్పులు చెప్పకుండా డైరెక్టర్ విషన్‌కు రెస్పెక్ట్ ఇచ్చాడు. అలా తెరకెక్కిన భలే భలే మగాడివోయ్ ఎంత మంచి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా నాని కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా నిలిచిపోయింది. అతనికి తిరుగులేని స్టార్‌డమ్‌ను తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే ఇదే కథలో సునీల్ నటించి ఉంటే.. కథ వేరే లెవెల్‌లో ఉండేదని.. ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.