ప్రభాస్ ‘ ఫౌజి ‘ పై బ్లాస్టింగ్ అప్డేట్.. నిజమైతే మాత్రం బొమ్మ అదిరిపోద్ది..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్‌ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన చేతిలో అర‌డ‌జ‌న్‌కు పైగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక తాజాగా మారుతి డైరెక్షన్లో రాజాసాబ్‌ సినిమా కంప్లీట్ చేసిన రెబల్ స్టార్.. త్వరలోనే హ‌నురాగపూడి డైరెక్షన్‌లో మరో సినిమాల్లో నటించనున్నాడు. ఇక ఈ సినిమా ఫౌజి రన్నింగ్ టైటిల్ తో రూపొందించనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది.

Who is Imanvi? Prabhas' new leading lady in upcoming movie Fauji

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు.. మరో స్టార్ హీరో న‌టించ‌నున్నాడ‌ట‌. అత‌ను ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బ‌చ‌న్. ఎస్ ప్ర‌భాస్‌, అభిషేక్‌ కలిసి ఈ మూవీలో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాలో రోల్ కోసం అభిషేక్‌ను కలిసిన‌ మేకర్స్.. కథ వినిపించారని.. అభిషేక్ ఆ స్టోరీ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అఫీషియల్ గా ప్రకటన రాకున్నా.. ప్రస్తుతం ఇదే న్యూస్‌ ట్రెండింగ్‌గా మారుతుంది.Abhishek Bachchan to take on Prabhas in Fauji?ఇక గతంలో ప్రభాస్‌తో పాటు.. అభిషేక్ తండ్రి అమితాబచ్చన్ క‌లిసి నటించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి ఒకే స్క్రీన్ పై మెర‌వ‌నున్నారు. ఇక ఈ సినిమా షూట్ టైంలో జరిగిన పరిచయంతోనే ప్రభాస్ సినిమా అనగానే.. అభిషేక్ బచ్చన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఫౌజిలో ప్రభాస్‌తో కలిసి అభిషేక్‌ నటించనున్నాడని తెలుస్తుంది. ఇదే వాస్తవం అయితే.. అభిషేక్ బచ్చన్ కు ఇది మొట్టమొదటి టాలీవుడ్ మూవీ అవుతుంది. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.