టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2. ఆయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వాని మెరవగా.. యష్ రాజ్ ఫిలిమ్స్.. స్ఫై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపోందుతుంది. ఇప్పటికే.. ఈ బ్యానర్ పై ఎన్నో సినిమాలు రూపొంది బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ అయినప్పటికీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లో నటిస్తున్న మొట్టమొదటి బాలీవుడ్ మూవీ కావడంతో.. టాలీవుడ్ ఆడియన్స్‌లోను ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది.
ఇప్పటివరకు తెరకెక్కని ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతుందని.. తాజాగా రిలీజైన ట్రైలర్‌తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాలో తారక్ నెగటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెరవనున్నాడు. కాగా వార్ 2లో ముందుగా ఎన్టీఆర్ ప్లేస్‌లో ప్రభాస్‌ను అనుకున్నాడట డైరెక్టర్. ప్రభాస్ ఆరడుగుల అదిరిపోయే కటౌట్, దానికి తగ్గట్టే బాలీవుడ్ లోనూ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకొని.. హృతిక్ రోషన్ కటౌట్‌కి తగ్గట్లుగా ప్రభాస్ పర్‌ఫెక్ట్.. ఇద్దరి మధ్యన వార్ అంటే ఆడియన్స్‌లో కచ్చితంగా హైప్ వచేస్తుంది.
ఈ క్రమంలోనే.. ఆ రోల్ కోసం.. మొదట ప్రభాస్‌ను భావించారట. కానీ ప్రభాస్ తన చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో నెగిటివ్ రోల్ చేస్తే ఎక్కడ ఇమేజ్ దెబ్బతింటుందో అనే ఉద్దేశంతో వార్ 2లో చేయనని చెప్పేసాడట. ఈ క్రమంలోనే ప్రభాస్ నుంచి తారక్ కు రోల్ వెళ్ళింది. ఏదేమైనా ఎన్టీఆర్‌కే ఈ రోల్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది.. ప్రభాస్ అయితే అంతలా సెట్ కాకపోయేదేమో.. తను ఈ ప్రాజెక్టులో రిజెక్ట్ చేసి మంచిగానే చేసాడంటూ అభిప్రాయాలు బాలీవుడ్ జనాల్లో వినిపించాయి. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ముందు ముందు ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో.. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.