ఆ మ్యాటర్‌లో లోకేష్ కనుకరాజ్‌ను కాపీ కొట్టిన వార్ 2.. అడ్డంగా బుక్కయ్యారే..!

మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ లెవెల్లో ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. బాలీవుడ్‌లోనే టాప్ బ్యానర్ అయిన య‌ష్ రాజ్‌ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించారు. ఇక.. ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన షాకింగ్ కామెంట్స్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి.

Vijay's master review, Vijay master movie review, Master review, Master  movie review

ఈ మూవీని లోకేష్ సినిమాను చూసి కాపీ చేశారంటూ.. ఇండస్ట్రీలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో భారీ యాక్షన్ సినిమాల్లోని సీన్స్ అన్నీ చాలావరకు ఇతర సినిమాల్లో కాపీ అంటూ వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అలా.. తాజాగా బాలీవుడ్ సినిమా పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ గతంలో ఎన్నడు నటించని విధంగా సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల‌తో ఆకట్టుకున్నాడు.

ఈ మూవీలో ప్రతి సీన్ ఆడియన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తుంది. క్లైమాక్స్ సీన్స్ అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు ఊహించనే ఊహించని రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాయి. క్లైమాక్స్ సీన్ విజయ్ నటించిన మాస్టర్ మూవీకి కాపీ అంటూ టాక్ తెగ వైరల్‌గా మారుతుంది. కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వార్ 2 టీం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.