వార్ 2 ఫస్ట్ రివ్యూ.. తారక్, హృతిక్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ మరో ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన సంగతి తెలిసిందే. ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఆగస్ట్ 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్, హృతిక్‌ మధ్య వార్ సీన్స్‌తో పాటు.. వీళ్ళిద్దరి మధ్య సాంగ్ నెక్స్ట్ లెవెల్‌లో హైలెట్ కానుందని సమాచారం.

ఇక సినిమా రన్ టైం ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతుంది. ఇందులో సినిమాకు 2 గంటల 53 నిమిషాల 24 సకన్ల‌ రన్ టైం తో రిలీజ్ అవుతున్న వార్ 2.. తెలుగు, తమిళ్‌లో 2 గంటల 51 నిమిషాల 44 సెకండ్లతో రిలీజ్ కానుందట‌. ఒకటిన్నర నిమిషాల రన్ టైం తేడాతో రానున్న ఈ మూవీలో హృతిక్, తారక్ స్క్రీన్ ప్రజెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని టాక్. అజ్ఞాతవాసిగా ఉన్న హృతిక్‌ని పట్టుకునేందుకు.. భారత్ స్పై ఏజెంట్గా ఎన్టీఆర్ మెరవనున్నాడు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ సీన్లు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్యాంగ్ గూస్ బంప్ తెప్పించడం ఖాయమని.. అలాగే వీళ్ళిద్దరి మధ్యన వచ్చే సాంగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్ గా మారనుంద‌ని వెల్లడించారు.

ఇక ఇది ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎనర్జిటిక్ విజువల్ ఫెస్ట్ కానుం దని.. ఈ పాట డ్యాన్స్ సీక్వెన్స్‌లు అదరగొడుతుందని సమాచారం. ఇక ఐమాక్స్ ఫార్మేట్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. డాల్బీ అట్మాస్ 4కే లో రిలీజ్ అవుతున్న మొదటి ఇండియన్ సినిమా కూడా ఇదే. కాగా.. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.355 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో హృతిక్, తారక్‌ల‌కు ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేస్తుందో.. ఏ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేస్తారో వేచి చూడాలి.