61 ఏళ్ల వయసులోను అలాంటి పని చేస్తున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. షాకింగ్ సీక్రెట్ రివీల్..!

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా రాణిస్తున్న వారు ఎంతోమంది ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటీమణులు తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. వారిలో.. అతికోంత‌మంది మాత్రమే.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. మరి కొంతమంది ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చాలా కాలమైనా సక్సెస్ కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. అయితే కొంత‌మంది ఏజ్ పైబడిన వరుస‌ సినిమా ఆఫర్లను అందుకుంటు కొనసాగుతున్నారు. అలాంటి వారిలో.. టాలీవుడ్ స్టార్ బ్యూటీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా కూడా ఒకటి.

Actress Sudha: భర్త, కొడుకు వదిలేసారు.. ఒంటరి జీవితం.. సీనియర్ నటి సుధ  ఎమోషనల్.. | ఇండియా న్యూస్ - News18 తెలుగు

ఈ టాలీవుడ్ సీనియర్ నటి.. ఇప్పటికే ఎన్నో పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అత్త, వదిన, అమ్మ పాత్రల్లో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వుతుంది. దాదాపు.. తన సినీ కెరీర్‌లో 500 కు పైగా సినిమాల్లో నటించిన సుధా.. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలోని నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో ఇప్ప‌టికి కొనసాగుతుంది. ఇక ఇప్పటికీ ఈ అమ్మడు యంగ్ హీరోయిన్ల రేంజ్‌లో ఫిట్నెస్‌తో.. చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది.

ఇప్పుడు తల్లిగా నటించాలంటే మనసు ఒప్పుకోవట్లేదు.. అందుకే చాలా సినిమాలు..'

తాజాగా తన ఫిట్నెస్ సీక్రెట్ రివిల్ చేసింది నటి సుధా. ఇప్పటికీ ఆమె అంతలా ఫిట్గా ఉండడానికి గల కారణాన్ని రివీల్ చేసింది. వాము.. వేడి నీళ్లలో కలుపుకుని నిత్యం తాగుతూ ఉంటానని చెప్పుకొచ్చింది. ఆమె ఇప్పటికీ ఇంతలా ఫిట్ గా ఉండడానికి అదే కారణమని చెప్పుకొచ్చింది. దీనివల్ల నేను ఎప్పటికీ యాక్టివ్గానే కనిపిస్తా అంటూ వివరించిన సుధా.. వేడి నీళ్లను తీసుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుందని.. నేను చిన్నప్పటి నుంచి వేడినీళ్లను తాగుతున్న అంటూ వివరించింది. తన హెల్త్ సీక్రెట్ కూడా అదేనంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.