సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. లోకేష్ కనకరాజు డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలి. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో.. భారీ కాస్టింగ్, ఆడియన్స్‌ను పలకరించనున్నారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నెగటివ్ షేడ్స్‌లో మెరువగా.. శృతిహాసన్, ఉపేంద్ర, పూజ హెగ్డే, రెబ మౌనిక జానా, శోభిన్ షాహిర్ తదితరులు కీలకపాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ మ్యూజిక్.. ఈ సినిమాకు మరింత హైలెట్. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలోనే.. సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు. అలా.. తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుమ ప్రశ్నలకు ఎన్నో ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పుకొచ్చారు టీం.
శృతిహాసన్ మాట్లాడుతూ.. ఇలాంటి ఓ పెద్ద సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేసింది. ఆయన నాకు మంచి రోల్ ఇచ్చారు. కూలీకి అనిరుధ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో వచ్చింది. రజినీకాంత్ గారితో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. నాగార్జున గారు అదరగొట్టారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక సుమ ప్రశ్నలకు ఆమె ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే.. పవన్ నుంచి మీరేం దొంగతనం చేస్తారు అంటే ఎనర్జీ, చరిష్మా.. ప్రభాస్ నుంచి ఫుడ్, అల్లు అర్జున్ నుంచి డాన్సింగ్, మహేష్ నుంచి స్టైల్ అండ్ గ్రేస్, బాలయ్య నుంచి హ్యూమర్, రజినీకాంత్ నుంచి అన్నీ దొంగతనం చేసేస్తా అంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది. ఇక నాగార్జున నుంచి డైట్, ఫిట్నెస్ అన్ని దొంగతనం చేసేస్తా అంటూ వివరించింది.
ఇక లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. నన్ను నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చిన రజనీకాంత్ గారికి చాలా థ్యాంక్స్. అమీర్ ఖాన్, శోభిన్, సత్యరాజ్, ఉపేంద్రకు థాంక్యూ. నాగార్జున గారికీ నా స్పెషల్ థాంక్యూ. ఈ సినిమాలో నాగార్జున గారు అద్భుతంగా నటించారు. చూస్తే మీకే అర్థమవుతుందంటూ లోకేష్ కనకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారని.. రిలీజ్ తర్వాత ఆడియన్స్ కి అర్థమవుతుందంటూ కామెంట్ చేసిన లోకేష్.. రజనీకాంత్, కమల్ సార్ ఇద్దరు నాకు రెండు కళ్ళు. వీళ్లిద్దరితో కలిసి సినిమా చేసేసా. ఇద్దరు లెజెండ్స్ అంటూ కామెంట్ చేశాడు. తెలుగులో దాదాపు అందరు హీరోలతో కలిసి పని చేయాలని ఉందంటూ లోకేష్ వివరించాడు. నేను కమిటీ అయిన సినిమాల తర్వాత తెలుగు హీరోలతో సినిమాలు చేస్తా అంటూ లోకేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.