టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు సన్నా కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది. భారీ అంచనాల నడుమ అర్బన్ బ్యాక్‌డ్రాప్‌తో యాక్షన్ డ్రామగా పొందుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌తోనే ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ఆకట్టుకుంది. మూవీలో చరణ్ పూర్తిగా రగడ్ మాస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ శివారులో వేసిన భారీ విలేజ్ సెట్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా కొనసాగుతుంది. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. మాస్, మెలోడీ, ఫోక్ ఇలా అన్నిటిలోనూ రెహమాన్ తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన స్పెషల్ ఫోక్ రీమిక్స్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. అదేంటంటే.. పల్లె జనాల్లో చాలా పాపులర్ అయిన జానపద గీతం మా ఊరి ప్రెసిడెంట్ సాంగ్ ను కొత్త స్టైల్ లో రీమిక్స్ చేసి బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ పాటను పెంచల్ దాస్ ఆలపించినట్లు తెలుస్తుంది. అలాగే.. రెహమాన్ మ్యూజిక్ తో పాటు చరణ్ తో కలిసి ఓ హాట్ బ్యూటీ డాన్స్ స్టెప్పులతో దుమ్ములేపనుందని.. ఈ సాంగ్ సినిమాకి హైలైట్స్ అన్ని సమాచారం. ఇంతకీ.. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ కిసిక్ బ్యూటీ శ్రీలీల.
తాజాగా జూనియర్ సినిమాలోని వైరల్ వయ్యారి సాంగ్‌తో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఎంట్రీ తో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. పెద్ది కోసం రామ్ చరణ్ తో కలిసి వచ్చే సాంగ్ లో తెలుగు ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతుందని సమాచారం. పుష్ప 2లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ రేంజ్ లో కిక్.. మాస్ ఆడియన్స్ కి ఇచ్చేలా, థియేటర్లను షేక్ చేసేలా ఈ సాంగ్ డిజైన్ చేశారట. ఇంత స్పెషల్ మాస్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారంటేనే పెద్ది సినిమా రొటీన్ మూవీ కాదని.. పాలిటిక్స్, స్పోర్ట్స్, పవర్ ప్యాక్ ఎమోషన్ మిక్స్డ్ బ్లాక్ బస్టర్ అని నమ్మకం ఆడియన్స్‌లో మొదలైపోయింది. ఈసారి చరణ్ బాక్స్ ఆఫీస్‌లో ఏ రేంజ్‌లో బ్లాస్ట్ చేస్తాడో చూడాలి.