నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడుపదుల వయసు మీద పడుతున్న ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నాడు బాలయ్య. అఖండ తో మొదలైన విజయ యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అఖండ నుంచి ఇప్పటివరకు బాలయ్య నటించిన ప్రతి సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. దీని బట్టి బాలయ్య స్టోరీ సెలక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఎప్పటికీ వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలయ్య అఖండ 2 షూటింగ్లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి క్రమంలో.. తాజాగా బాలయ్యకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఈ వార్తపై కోలీవుడ్ జనాల సైతం ఆసక్తి చూపించే రేంజ్ లో హైప్ నెలకొంది. అయితే.. ఈ వార్తలన్నీ నిజమేనని తాజాగా క్లారిటీ వచ్చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. రజిని జైలర్ 2లో బాలయ్య ఓ స్పెషల్ రోల్లో మెరవనున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య, రజినీని ఒకే స్క్రీన్‌పై చూడాలని కేవలం అభిమానులు కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఇవన్నీ కేవలం ఫేక్ న్యూస్ అంటూ టాక్ నడిచింది.
కానీ.. తాజాగా చెన్నై నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. జైలర్ 2 లో బాలయ్య రోల్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని.. ఈ సినిమాతో బాలకృష్ణకు కోలీవుడ్‌లో కూడా స్పెషల్ ఇమేజ్ ఏర్పడుతుందంటూ.. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీ కి చాలా సమయం పట్టినా.. పాత్ర కేవలం 20 నిమిషాల నాత్ర నడివి ఉన్నా.. స్టోరీని మలునుతిప్పేది బాలయ్య రోల్ అన్ని.. ముఖ్యంగా రజనీకాంత్, బాలయ్య మధ్య డైలాగ్స్ అభిమానులను నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఇక ఈ కాంబోలో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. వేచి చూడాలి.