బన్నీ సినిమా కోసం ఆ హిట్ ఫార్ములాస్.. అంచనాలు పెంచేస్తున్న అట్లీ..!

పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో తాజాగా AA22 కూడా చేరిపోయింది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మేకర్స్ చాలా పవర్ఫుల్ కంటెంట్ తో డిజైన్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమా కోసం ప‌లు హిట్ సెంటిమెంట్స్‌ ను రిపీట్ చేయనున్నారు అనే టాక్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.

జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో నేషనల్ మార్కెట్‌ను షేక్‌ చేసిన అట్లీ.. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా గ్లోబల్ మూవీ ని రూపొందిస్తున్నాడు. పుష్ప 2 లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత.. బన్నీ ఈ ప్రాజెక్ట్‌లో మెర‌వ‌నున్నాడు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే మంచి హైప్ నెల‌కొంది. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే ఆడియన్స్ అంచనాలను అందుకునేందుకు ఓ హిట్ సెంటిమెంట్‌ను డైరెక్టర్ అట్లీ రిపీట్ చేయనున్నాడట. జవాన్ మూవీలో నయనతార తో పాటు.. దీపిక, ప్రియ‌మ‌ణి కీ రోల్‌లో మెరిసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు AA22 లోను అదే సెంటిమెంట్ ను రిపీట్ చేయనున్నాడని.. ఏకంగా సినిమా కోసం ఐదుగురు హీరోయిన్స్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీపికా, మృణాల్ ఠాగూర్, జాన్వి కపూర్ లతో పాటే మరో ఇద్దరు హీరోయిన్లు సినిమాల్లో మరెవ‌నున్నాడట. వారిలో ఒకరు భాగ్యశ్రీ బోర్సే అని.. మరో బ్యూటీ కూడా ఈ సినిమాలో నటిస్తుందంటూ టాక్ వైరల్ అవుతుంది. విలన్ విషయంలో జవాన్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నారట టీం. ఇక జవాన్ సినిమాలో నెగిటివ్ రోల్‌లో నటించిన విజయ్ సేతుపతినే అల్లు అర్జున్ సినిమాలోను విల‌న్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇలా.. జవాన్ మూవీ సక్సెస్ లో భాగమైన రెండు హిట్ సెంటిమెంట్లను బన్నీ సినిమా విషయంలోను అట్లీ రిపీట్ చేయడంతో.. ఫ్యాన్స్ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.