స్పిరిట్: ప్రభాస్ విలన్ ఎవరో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా సందీప్‌ రెడ్డి వంగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అర్జున్ రెడ్డితో కల్ట్‌ బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకున్న ఆయన.. హిందీలో ఇదే సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇక తాజాగా.. బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన కాంబోలో యానిమల్ సినిమాను రూపొందించి రికార్డులు క్రియేట్ చేశాడు. అంతేకాదు త్వరలోనే ప్రభాస్ తో కలిసి స్పిరిట్ సినిమాను చేయనున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగుతోపాటు.. ఇంగ్లీష్, హింది, మలయాళ, తమిళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Prabhas, Sandeep Reddy Vanga's Spirit to Start Filming in June?
టీ – సిరీస్‌, భ‌ద్ర‌కాళీ పిక్స్చ‌ర్స్ బ్యాన‌ర్‌ల‌పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీలో.. ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటిసారి పోలీసు రోల్ లో మెరవనున్నడు. ఇది ఓ సీరియస్ కాప్ స్టోరీ అని ప్రతి ఇంటర్వ్యూల సందీప్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌లో భారీ హైప్‌ నెలకొంది. ఇక.. ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి హీరోయిన్గా మెరవనుందని అఫీషియల్ గా ప్రకటించాడు సందీప్. అంతే కాదు.. తాజాగా విలన్ క్యారెక్టర్ పై అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు.
మొదట్లో ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం కొరియన్‌ నటుడు డాన్లీ నటిస్తున్నాడు అంటూ వార్తలు తెగ వైరల్ గా మారాయి. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న సందీప్ దీనిపై రియాక్ట్ అయ్యాడు. స్పిరిట్ మూవీ విలన్ ఎవరని ఎంతోమంది అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మూవీలో నేనే విలన్ అంటూ బిగ్ ట్విస్ట్  ఇచ్చి అందరికీ షాక్ ను కలిగించాడు సందీప్. నిజంగానే సందీప్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడా.. లేదా ఫన్నీగా అలాంటి కామెంట్ చేశారా.. అనేది తెలియదు కానీ.. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.