రాజ్‌తో సెకండ్ మ్యారేజ్.. సినిమాలకు గుడ్ బై చెప్పేసి అక్కడ సెటిల్ కానున్న సమంత..!

సమంత.. ఇటీవల పర్సనల్ విషయాలతోనే ఎక్కువ‌ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్‌తో సమంత ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ వార్తలకు తగ్గట్టుగానే.. అమ్మడు ప్రతిసారి బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ లు డిన్నర్ డేటింగ్ లో అంటూ తెగ తిరిగేస్తుంది. ఇప్పటికే పలు వెకేషన్ లకు వెళ్లి వచ్చిన శ్యామ్.. తాజాగా ఒకే కారులో రీసెంట్ గా డిన్నర్ కు వెళ్లి వచ్చింది. ఈ డిన్నర్ డేట్ కి సంబంధించిన ఫొటోస్ సైతం వైరల్‌గా మారాయి. అయితే.. త్వరలోనే వీళ్ళు వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి క్రమంలోనే ఇప్పటికే రహస్యంగా ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని.. ఈ క్రమంలోనే తన చేతి వేలికి ఉన్న ఆ రింగ్ ను అంత స్పెషల్ గా హైలెట్ చేస్తూ చూపించిందని.. ఫోటోలకు ఫోజులు ఇచ్చిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. సమంత ఎంగేజ్మెంట్ చేసుకుంటే అఫీషియల్ గానే చేసుకుని మ్యారేజ్ చేసుకోవచ్చు కదా.. ఇవన్నీ ఫేక్ వార్తలంటూ మరి కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో షాకింగ్ న్యూస్‌ వైరల్ గా మారుతుంది.

సమంత వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేయాలని ఫిక్స్ అయిందట. ప్రస్తుతం తను ఒప్పుకున్న సినిమాలను మాత్రమే పూర్తిచేసి.. తర్వాత రాజ్ నిడమోరుతో తన లైఫ్‌ను హ్యాపీగా గడిపేయాలని.. బిజినెస్ రంగంలో ఎంట్రీ ఇచ్చి అక్కడ తన మార్క్‌ను క్రియేట్ చేసుకోవాలని చూస్తుందట. అంతేకాదు.. తాను రాజ్‌తో న్యూ లైఫ్‌ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇండియాకు కూడా ఆమె దూరమైపోతుందని టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇది నిజమైతే మాత్రం సమంత ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేకే అనడంలో అతి శ‌యోక్తి లేదు.