సినీ ఇండస్ట్రీలో సీనియర్ సెలబ్రిటీస్‌గా దూసుకుపోతున్న స్టార్ హీరోలు, నటీనటులు చాలామంది కేవలం సినిమాలే కాకుండా.. ఇతర రంగాల్లోనూ తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు ఇంట్రెస్టింగ్ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. అలా.. గతంలో చిరంజీవి ఓ రియాల్టీ షో హోస్ట్‌గా వ్యవహరించగా.. మరో సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఇప్పటికీ అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికెతో సక్సెస్‌ఫుల్‌గా సీజన్లపై సీజన్లు రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున సైతం బిగ్ బాస్ షో హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. తన క్రియేటివిటీని చాటుకుంటున్నాడు.
ఇప్పుడు అదే లిస్టులోకి.. మరో సీనియర్ నటుడు.. ఒకప్పటి స్టార్ హీరో జగపతిబాబు కూడా జాయిన్ అయ్యారు. జగపతిబాబు కూడా హోస్ట్ గా వ్యవహరించేందుకు జయమ్ము నిశ్చయంబురా అనే షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే తాజాగా ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజై నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ నాగార్జున స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. నా స్నేహితుడు నాగార్జున అంటూ షోలోకి ఆహ్వానించారు జగపతిబాబు.. ఏం దాచుకోకుండా మాట్లాడేసే షో ఇది అంటూ నాగ్‌తో చెప్పుకొచ్చాడు. ఓకే అంటు నవ్వులు కురిపించారు నాగ్.
ఈ క్రమంలోనే.. జగపతిబాబు అడిగిన ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు నాగార్జున చెప్పిన క్రేజీ ఆన్సర్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ ప్రోమోలో రమ్యకృష్ణ, టబ్బు వీళ్లిద్దరిలో బెస్ట్ కో-యాక్టర్స్ ఎవరు అని జగపతిబాబు.. నాగార్జునను ప్రశ్నించగా.. కొన్ని చెప్పకూడదు, నేను చెప్పను అంటూ తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకున్నాడు. నాగార్జున ఇందులో భాగంగానే.. జగపతిబాబును ప్రశ్నిస్తూ.. రమ్యకృష్ణ, సౌందర్య వీళ్ళిద్దరిన నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించాడు. జగపతిబాబు.. ఇది నా ఇంటర్వ్యూ కాదు అంటూ ఆన్సర్ చెప్పకుండా దాటేసాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఈ సిల్లీ కాన్వర్జేషన్ ప్రోమో తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే షో ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ.. ఇరు హీరోల ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ షో ఫుల్ ఎపిసోడ్ ఓటీటీ జి 5లో ఈ నెల 15 నుంచి వీక్షించవచ్చు.