ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. శ్యామలాదేవి సెన్సేషనల్ అనౌన్స్మెంట్..!

టాలీవుడ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వ‌రుస‌ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ నాలుగు పదుల వయ‌స్సు దాటిపోతున్నా.. ఇప్పటివరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఈ క్రమంలోనే అభిమానులంతా ప్రభాస్ సినిమాలతో పాటే.. ఆయన పెళ్లి విషయంపై కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు డార్లింగ్ వివాహం చేసుకుంటాడు అంటూ ఆరాటపడుతున్నారు. ఎట్టకేలకు ప్రభాస్ అభిమానులకు.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

Prabhas' aunt Shyamala Devi spills the beans on his wedding plans: We will invite all media for the marriage and celebrate it | Hindi Movie News - Times of India

ప్రభాస్ పెళ్లిపై ఆమె రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చింది. తాజాగా.. మీడియాతో ముచ్చటించిన శ్యామల దేవి.. ఈ సంవత్సరం ప్రభాస్ మ్యారేజ్ కచ్చితంగా జరిగిపోతుందంటూ చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రభాస్ పెళ్లి గురించి గత పదేళ్లుగా ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ.. ఒక్కటి కూడా నిజం కాలేదు. ఇలాంటి క్రమంలో ఆమె మీడియాతో ఈ ఏడాదిలోనే పెళ్లి ఫిక్స్ అంటూ క్లారిటీ ఇవ్వడం అభిమానంగా ఆనందాన్ని కలిగిస్తుంది. బాహుబలితో పాన్ ఇండియా రెబల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ పెళ్లి విషయంలో కేవలం.. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులంతా ఎదురుచూస్తున్నారు .

Shyamala Devi: Prabhas' Favorite Is Pulasa Chepa

ఈ క్రమంలోనే స్టార్ హీరో కృష్ణంరాజు భార్య.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఆ దేవుడి ఆశీస్సులతో త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందంటూ చెప్పుకొచ్చింది. ఆమె ఈ ఏడదిలోనే ప్రభాస్ పెళ్లి చేయాలనుకుంటున్నట్లు హింట్ ఇచ్చింది మీరంతా ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు అడుగుతుంటారు.. తప్పకుండా బాబు పెళ్లి జరిగిపోతుంది.. మనస్పూర్తిగా చేయాలని మాకు కూడా ఉంది. కానీ.. శివుడు ఆజ్ఞ‌ లేనిదే చీమైనా కొట్టదంటారు కదా.. శివుడు అనుగ్రహిస్తే ఆయన ఏ రోజు అనుకుంటే.. ఆ రోజే పెళ్లి జరగబోతుంది అంటూ శ్యామల దేవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.