ప్రభాస్.. ఫౌజి, స్పిరిట్, రాజాసాబ్ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ అదేనా.. రియల్ లైఫ్ లో లానే..

గత కొద్ది ఏళ్లుగా.. మోస్ట్ పాపులర్ స్టార్ హీరోల లిస్ట్‌లో ప్రభాస్ నెంబర్ 1 పొజిషన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ ఫిలిం సర్కిల్ లోనే కాదు.. ఎక్కడ చూసినా ప్ర‌భాస్ సినిమాలకు సంబంధించిన వార్తలే హాట్ టాపిక్‌గా వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌ అంతకంతకు పెరిగిపోయింది. ఆయన నటించిన ప్రతి సినిమా నేషనల్ లెవెల్ లో, గ్లోబల్ లెవెల్ లో భారీ హైన్ నెలకొల్పుతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుసగా మూడు సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.

 

వాటిలో మొదటిది మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ మరొకటి.. హ‌ను రాఘ‌వ‌నూడి డైరెక్షన్లో ఫౌజి. వీటన్నింటికంటే మోస్ట్ అవైటెడ్‌ మూవీ స్పిరిట్‌. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఈ మూడు ప్రాజెక్టులు వాస్తవానికి వేరే వేరే జోనర్‌ల‌లో తెరకెక్కనున్నాయి. కానీ.. మూడు సినిమాలకు ఒక కామన్ పాయింట్ మాత్రం కనిపించనుందని టాక్‌. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే ఈ మూడు సినిమాల్లో ప్రభాస్ ఓ లవ్ ఫెయిల్యూర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారట.

ఇప్పటికే రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ లవ్ ఫెయిల్యూర్ గా కనిపిస్తాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇలాంటి క్రమంలో.. ఫౌజీ సినిమాలో ఆయ‌న రోల్ కూడా అదే కోణంలో ఉంటుందని అంటున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా సైతం లవ్ ఫెయిల్యూర్ షర్ట్స్ చుట్టూ తిరిగేలా వైవిద్యంగా డిజైన్ చేశాడట. అలా మూడు సినిమాల్లోనూ ప్రభాస్ లవ్ ఫెయిల్యూర్ గా ఓకే ఎమోషన్ను చూపించనున్నాడట. ఇలాంటి క్రమంలోనే ఇప్పటికే లవ్ ఫెయిల్యూర్ గా ప్రభాస్ రియల్ లైఫ్ లో అనుభవించిన ఎమోష‌న్స్‌.. సినిమాలో చూపించేందుకు సిద్ధమవుతున్నాడు అంటూ చర్చలు మొదలైపోయాయి.