నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ పక్కన సినిమాలు.. మరో పక్కన పాలిటిక్స్ లోను సక్సెస్ అందుకుంటూ రాణిస్తున్న బాలయ్య.. చివరిగా నాలుగు సినిమాలతో హిట్స్ అందుకుని ఫుల్ జోష్ తో ఉన్నాడు. ఈ క్రమంలో బాలయ్య .. తన లక్కీ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా అఖండ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాతో బాలయ్య బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ.. పాన్ ఇండియా లెవెల్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి క్రమంలోనే తాజాగా ఆయన నెక్స్ట్ సినిమాపై ఓ పవర్ ఫుల్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. అఖండ 2 తర్వాత బాలయ్య, గోపీచంద్ మాలినేనీతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై గోపిచంద్ పవర్ఫుల్ పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ పవర్ఫుల్ అప్డేట్ వైరల్ గా మారుతుంది.
అంతేకాదు గోపీచంద్ మలినేని సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసేసాడు అని.. అంతేకాదు సినిమాలో ఓ కీలక పాత్ర కోసం.. తమిళ్ స్టార్ హీరోని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు అంటూ సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై.. వెంకట సతీష్ కిల్లారు ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా రూపొందిందట. ఇక.. తాజాగా ఈ సినిమా విషయంలో గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా రియాక్ట అవుతూ గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్. ఈసారి మా గర్జన మరింత స్ట్రాంగ్ గా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా కానుంది అంటూ ఒక పవర్ఫుల్ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ఇక.. బాలయ్య, గోపీచంద్ కాంబోలో రానున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లో 111వ ప్రాజెక్ట్ కావడం విశేషం.