లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో పవన్.. స్టోరీ లైన్ చూస్తే మైండ్ బ్లాకే..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి తన‌ సత్తా చాటుకోవాలని ప్రతి ఒక్క స్టార్ హీరో, హీరోయిన్లు, డైరెక్ట‌ర్లు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే వారి చేసే కాంబినేషన్లపై కూడా ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంటుంది. ఓ స్టార్ హీరో డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. సినిమా సెట్స్‌పైకైనా రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన హైప్ మొదలవుతుంది. ఈ క్రమంలోనే సినిమా పూర్తై.. రిలీజ్ అవ్వ‌క ముందే అంచనాలు ఆకాశానికి అందుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్‌తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ లో భారీ వసూళ‌ను కొల్లగొట్టి.. దాదాపు బ్రేక్ ఈవెన్‌కు చేరువైపోతున్నాయి. దీంతో నిర్మాతలు సైతం భారీ బడ్జెట్ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.

కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన కేవీఎన్‌ ప్రొడక్షన్ తాజాగా ఇలాంటి సెన్సేషనల్ కాంబో కోసం సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే కెవిఎన్ ప్రొడక్షన్ మేకర్స్ రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి వెళ్లి పవన్ ను కలిసిన పిక్స్ నెటింట‌ వైరల్ గా మారుతున్నాయి. ఏదో క్యాజువల్ గా పవన్ ను వాళ్లు కలిశారని అంతా అనుకున్నారు. కానీ.. కలిసింది ఓ సినిమా చేయడానికి అని టాక్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. పవన్ ఆయనకు డేట్స్ కూడా ఇచ్చేసాడట. కేవలం పవన్ డేట్స్ మాత్రమే కాదు.. తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ డేట్స్‌ సైతం ప్రస్తుతం కేవీఎన్ వద్ద ఉన్నాయని.. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ క్రేజీ సినిమా ఉందంటూ టాక్‌ నడుస్తుంది.

ఇది ఓ యాక్షన్ జానర్‌లో రూపొందినందుని సమాచారం. పవన్ యాక్షన్ జాన‌ర్లో సినిమా చేస్తున్నాడు అంటే ఓజి సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో అంతకుమించిపోయే రేంజ్ లో క్రేజ్ రావడం ఖాయం. అది కూడా లోకేష్ కనకరాజ్‌ లాంటి హిట్ డైరెక్టర్‌తో సినిమా కనుక.. అంచనాలు ఆకాశానికి అంటుతాయి. ఈ క్రమంలోనే సినిమా అఫీషియల్ ప్రకటన వస్తే ఇండియాలో మోస్ట్ ప్రెస్టేజ్ ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుంది అనడంలా సందేహం లేదు. ఇక ఎంతవరకు ఈ కాంబో ఆడియన్స్ మెప్పిస్తుందో.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.