టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రేంజ్‌లో సక్సెస్‌లు అందుకొంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఆయన నుంచి వచ్చే సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కాగా.. పవన్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే.. ఆయన నుంచి రానున్న ఓజి సినిమా మరో ఎత్తు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు ధీమా వ్యక్తం చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ పాలిటిక్స్‌లో డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ఓజి సినిమా సెట్స్ లోను పాల్గొంటూ సందడి చేస్తున్నాడు.
ఓజి తో పవన్ పాన్ ఇండియాలో వెళ్లి రికార్డులు కొల్లగొట్టడం ఖాయమంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ ప్రస్తుతం ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్‌లను కంప్లీట్ చేసి సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇలాంటి క్రమంలోనే కొడుకు ఆకిరానందన్ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం పవన్ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఎన్నో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అకిరా ఎప్పుడు ఇండస్ట్రీకి వస్తాడనేదానిపై మాత్రం సరైన క్లారిటీ లేకున్నా.. ప్రస్తుతం తాను యాక్టింగ్ మెలకువలు నేర్చుకుంటున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఆఖీరా తన ట్రైనింగ్ ను పూర్తి చేసి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని.. తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇక పవన్ సైతం అకిరాను హీరోగా మార్చి.. తను ఫుల్ టైం పాలిటిక్స్ లో ఫిక్స్ అవ్వాలని భావిస్తున్నాడట. ఇక ఇప్పటివరకు అకిరా మీడియా ముందుకు పెద్దగా వచ్చింది లేదు. అప్పుడప్పుడు తళ్లుకున్న మెరిసి మాయమవుతూ ఉండే అకిరా.. ప్రస్తుతం సినీ ఎంట్రీ విషయంలో తెగ వైరల్ గా మారుతున్నాడు. చూడటానికి పవన్ కళ్యాణ్ లాగానే ఉండడం.. ఆయనను మించిపోయే కటౌట్‌తో ఆకట్టుకోవడంతో.. పవన అభిమానులంతా అకిరా ఇండస్ట్రీ లోకి వస్తే కచ్చితంగా స్టార్ హీరో అవడం, ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ ఆకిర ఎంట్రీ బాధితులను సుజిత్ కు అప్పచెప్పినట్లు టాక్. ఓజి సినిమాని చాలా అద్భుతంగా రూపొందించిన సుజిత్ డెడికేషన్.. దగ్గర నుంచి చూసిన పవన్.. అకిరాను అతని చేతిలో పెడితే కచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తాడని నమ్ముతున్నాడట. అలాగే ఈ జనరేషన్ కి ఏం కావాలో సుజిత్ కి బాగా తెలుసు అనే ఆలోచనతో సుజిత్ కు.. అకిరా ఎంట్రీ బాధ్యతలు అప్పచెప్పనున్నట్లు సమాచారం.