టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్న ఎన్టీఆర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్‌గా బిరుదును సైతం దక్కించుకున్నారు. ఇక నందమూరి హరికృష్ణ వారసత్వంగా సినిమాల్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. త్వరలోనే ఆయన వారసుడుగా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడంటూ న్యూస్ ఇటీవల కాలంలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. మరోసారి తారక్ పొలిటికల్ ఎంట్రీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. కొద్దిరోజులుగా ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్.. ఎన్టీఆర్ పై చేసిన సంచలన కామెంట్లు అభిమానులను తీవ్ర అగ్రహానికి గురిచేశాయి. చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే.. తర్వాత బహిరంగంగా ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్తాడని అంత అనుకున్నారు. కానీ.. ఆయన సైలెంట్‌గా ఉండిపోవడంతో.. వచ్చే ఎన్నికల్లో టిడిపికి తగిన బుద్ధి చెప్పడానికి తారక్ పొలిటికల్ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని.. నోటికొచ్చినట్లుగా ఎన్టీఆర్ పై తీవ్ర కామెంట్స్ చేసిన వారందరికీ ఆయన ఎంట్రీతోనే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడని.. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్తాడంటూ తారక్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి క్రమంలో.. ఆయన పొలిటికల్ ఎంట్రీపై తన అక్క నందమూరి సుహాసిని అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా తండ్రి హరికృష్ణకు నివాళ్ళి అర్పించిన సుహాసిని.. మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే తండ్రి హరికృష్ణ వారసత్వంలో.. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అని మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని.. అవకాశం వస్తే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని వివరించారు. ఆమె వ్యాఖ్యలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి.
View this post on Instagram