మెగా 157: “మన శంకర వరప్రసాద్ గారు ” వచ్చేసారోచ్.. బాస్ ఎంట్రీ అదుర్స్(వీడియో)..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా తన 70వ‌ పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేశారు. ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న అనిల్ రావిపూడి మెగా 157 మూవీ గ్లింప్స్ కొద్ది నిమిషాల క్రితం గ్రాండ్గా రిలీజ్ చేశారు టీం. మెగాస్టార్ ఒరిజినల్ పేరుని టైటిల్ గా ఫిక్స్ చేస్తూ అఫీషియల్ గా ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ గారు పండగ‌కి వచ్చేస్తున్నారు అంటూ టైటిల్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ తో అనౌన్స్ చేయ‌డం ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

ఇక ఫుల్ సెక్యూరిటీ మధ్యలో అదిరిపోయే మ్యూజిక్ తో బాస్ ఎంట్రీ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ అనడంలో సందేహం లేదు. గ్లింప్స్ వీడియోలో చిరు స్టైల్, లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంతకీ సినిమాలో ఆయన రోల్ ఏంటి అనే దానిపై నిన్న మొన్నటి వరకు నెటింట‌ తెగ వార్తలు వైరాల్ అయ్యినా.. ఎట్టకేలకు ఆ ఎదురుచూపులకు చెక్ ప‌డింది. మన శంకరా వరప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు అంటూ టైటిల్ అనౌన్స్ చేసి రోల్ నేమ్‌పై కూడా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో సినిమాపై మరింత హైప్‌ మొదలైంది. మూవీలో వెంకటేష్ కీలక పాత్రలో మెరవ‌నున్న సంగతి తెలిసిందే.

Here is when Mega 157 title treat will be revealed | cinejosh.com

ఈయన పాత్రనడివి తక్కువే అయినా క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పేది నా పాత్రే అంటూ వెంక‌టేష్ గ‌తంలో స్వ‌యంగా వెల్ల‌డించిరు. ఇక అనిల్ రావిపూడి సైతం మొదటి నుంచి సంక్రాంతికి ర‌ఫాడించేద్దామంటూ సినిమాపై హైప్‌ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే టైటిల్ గ్లింప్స్‌ చూస్తుంటే.. పండక్కి మరోసారి అనిల్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని.. చిరు ఖాతాలో మరో హిట్ పక్కా అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.