కూలీలో కమల్ హాసన్.. ట్రైలర్లో బిగ్ లీక్.. అదిరిపోయే ట్విస్ట్!

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో కూలి ఒక‌టి. కోలీవుడ్ హీరో రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబోలో రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా ధియేట్రిక‌ల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రోల్ ఇంట్రడక్షన్స్‌, రెండే రెండు యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ను లాగించేసారని అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. అంతేకాదు.. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వీక్ గా ఉందనే కామెంట్లు వినిపించాయి. ఎలాంటి సినిమాకైనా తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ బ‌జ్ క్రియేట్ చేసే అనిరుధ్‌.. ఈ సినిమాకు కూడా మ్యూజిక్ తో హైప్‌ తెచ్చే ప్రయత్నం చేశాడు.

కానీ.. ట్రైలర్ విషయంలో న్యాయం చేయలేకపోయాడు. అనిరుధ్‌ నుంచి నెక్స్ట్ లెవెల్ ఎనర్జీని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్‌కు నీరసమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రావడం నిరాశను కలిగించిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ట్రైలర్లో రజని మార్క్‌ హీరోయిజం, ఎమోషన్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. అయితే.. ట్రైలర్‌ కట్‌లో శృతిహాసన్‌తో రజినీకాంత్ పలికిన కొన్ని డైలాగ్స్ కమల్ హాసన్ గురించి హింట్‌ ఇచ్చినట్లు అనిపించింది.

அப்பா கமலுக்கு அப்படி ஒரு படம்.. நன்றி லோகேஷ்.. கூலி இசை வெளியீட்டு விழாவில் ஸ்ருதிஹாசன் பேச்சு | Shruthi Haasan Said Thanks to Lokesh Kanagaraj in Coolie Audio Launch ...

తను నీకు కేవలం నాన్న‌ మాత్రమే. నాకు ప్రాణ స్నేహితుడు అంటూ రజని చెప్పిన డైలాగ్.. రియల్ లైఫ్ లో కమలహాసన్ నిజంగా రజనీకాంత్‌కి ప్రాణ స్నేహితుడే. ఈ క్రమంలోనే సినిమాలో రజనీకాంత్ కొట్టిన డైలాగ్ కమల్ హాసన్‌ను ఉద్దేశించే అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఇందులో కమల్ హాసన్ కూడా ఉన్నాడా అనే సందేహాలు ఆడియన్స్‌లో మొదలయ్యాయి. కానీ.. కమల్ ఇందులో నటించే అవకాశం లేదు. ఇది కేవలం సినిమా కథకు సంబంధించిన డైలాగ్ మాత్రమే అనిపిస్తుంది. మూవీ పరంగా తన ప్రాణ స్నేహితుడు కూతురిని విల‌న్స్‌ నుంచి కాపాడే సీన్స్ అని అర్థమవుతుంది.