నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి.. టాలీవుడ్ నాచురల్ స్టార్‌గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సినిమా వస్తుందంటే మినిమం 100 కోట్లు గ్యారెంటి అనే రేంజ్‌లో సక్సెస్ అందుకుంటున్నాడు. ఇక సినిమాల పరంగానే కాకుండా.. పర్సనల్ పరంగాను.. నానిని ప్రతి ఒక్కరు అభిమానిస్తూ ఉంటారు. దానికి కారణం ఎదుట ఉన్నది ఎంత పెద్ద వారైనా.. ఎలాంటి వారైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తాడు. ఈ కారణంగానే నాని ని ఎంతోమంది అభిమానిస్తూ ఉంటారు. అలా.. తాజాగా నాని ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. అయితే.. ఇప్పటివరకు సినిమాలపరంగా ప్రమోషన్స్‌లో మాత్రమే సందడి చేసే నాని.. తన కెరీర్‌లో మొట్టమొదటిసారి టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరించిన జయమ్ము నిశ్చయమ్మురా షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు.
ఈ షోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇక ఇందులో నాని చేసిన కొన్ని కామెంట్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. జగపతిబాబుతో సరదాగా ఫన్నీగా ఇంటర్వ్యూను పూర్తి చేశాడు. నాని మాట్లతలాడుతూ.. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్న.. ఏదైనా సినిమా వస్తుందంటే అప్పుడే మరో రెండు, మూడు సినిమాలు రిలీజ్ అయ్యే సందర్భాలు వస్తుంటాయి. మరి వాటిని కాంపిటీషన్ గా ఎందుకు చూస్తారో నాకైతే ఇప్పటికీ తెలియదు. ఏ సినిమా అయినా ఆ సినిమా ఫ్యాన్స్ కోసమే ప్రత్యేకించబడి ఉంటుంది. ఆ సినిమాకి ఒక స్పెషల్ సందడి ఉంటుంది. కానీ.. మా సినిమా ఆడాలి.. ఇంకో సినిమా ఆడకూడదు అని ఆలోచించడం.. అసలు సరైన విధానమే కాదు. ఓ హీరో సినిమా సక్సెస్ అయితే ఇంకో హీరో సినిమా సక్సెస్ కాకపోతే.. అది మనకు కూడా నష్టమే.
ఇండస్ట్రీలో ఏ సినిమా ఆడకపోతే అప్పుడు మన సినిమా కూడా ఆడదు. అందుకే.. నేనెప్పుడూ అన్ని సినిమాలు ఆడాలి ప్రతి సినిమా హిట్ కొట్టాలనే కోరుకుంటున్నాను. ఆ సినిమా రిలీజ్ టైం లో అయినా మరో సినిమా రిలీజ్ అయితే ఇంట్లో కచ్చితంగా రెండు సినిమాలు హిట్ కొట్టాలనే ప్రార్థిస్తా. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకునే టైప్ నేను. నేను మాత్రమే బాగుండాలి అనుకుంటే అందరితో పాటే మనకి మేలు జరగదు. అంతా బాగుండాలనుకుంటే.. మనం కోరుకున్న ఆశీర్వాదం మనకు కూడా దక్కుతుంది. అంతా హ్యాపీగా ఉంటారు అంటూ నాని కామెంట్స్ చేశారు. నాని చేసిన కామెంట్స్‌కు ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. సినీ లవర్స్ సైతం నాని చెప్పిన మాటలు అక్షర సత్యం అని.. ఇండస్ట్రీలో ప్రతి హీరో ఇలాగే ఆలోచిస్తే.. కచ్చితంగా సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటాయని.. మన సినిమా మాత్రమే ఆడాలి అనే విధానం హీరోలు మార్చేస్తే బాగుపడతారు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.