టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. తాజాగా సరికొత్త రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తన ముఖ చిత్రంతో కూడిన ప్రముఖ మ్యాగజైన్.. ఎస్ప్కైర్ ఇండియా లేటెస్ట్ ఎడిషన్.. మార్కెట్లో రిలీజ్ అయింది. ఇక ఈ మ్యాగజైన్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. కాగా తాజాగా.. ఈ ఎస్ప్కైర్ ఇండియా మ్యాగజైన్‌తో తారక్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు.
నా లైఫ్‌లో ఏది నేను ప్లాన్ చేసుకోలేదంటూ వివరించిన తారక్.. కుంగ్ ఫూ పాండాలో నాకెంతో ఇష్టమైన కొటేషన్ ఒకటి ఉందంటూ వివరించాడు. నిన్నటి రోజు చరిత్ర.. రేపటి రోజు తెలియని మర్మం.. కానీ ఈరోజు మన చేతిలో ఉన్న గొప్ప బహుమతి.. అనే కొటేషన్ నా మనసులో ఎప్పటినుంచో నాటుకుపోయింది. అందుకే.. నేను ఎప్పుడూ నా ప్రెసెంట్ టైం పైనే దృష్టి పెడతా అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఒక నటుడుగా నేను ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటా. ఇక.. నా సినీ వారసత్వం నా చేతిలో ఉండదు.. ఇప్పటికిప్పుడు నాకు దాని గురించి తెలియదు.. అది వాళ్ళ వ్యక్తిగతం.
ఆ విషయంలో నేను ముందే ఏమి ప్లాన్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆడియన్స్ మధ్యలో నిలిచిపోయే కథలు చెప్పడమే నా లక్ష్యం అని.. ఎమోషన్స్‌తో కూడిన ఓ హానెస్టీ పర్సన్‌గా జనం మధ్యలో ఎప్పటికీ గుర్తుండిపోవాలన్నది నా కోరిక అంటూ వివరించాడు ఎన్టీఆర్. వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటాడో.. బాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటాడో చూడాలి.